ఫ్రెండ్‌షిప్ డే: ఒకే వేదికపై ములాయంతో అమర్ సింగ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ కూడా వారితో పాటు న్నారు. ములాయం సింగ్ యాదవ్ సోదరుడు రామ్ గోపాల్ యాదవ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
అమర్ సింగ్‌ను 2010 ఫిబ్రవరిలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి బహిష్కరించారు. ఆయనతో పాటు అప్పటి లోకసభ సభ్యురాలు జయప్రదను కూడా ఎస్పీ బహిష్కరించింది. సోషలిస్టు నేత జ్ఞానేశ్వర్ మిశ్రాకు అంకితం ఇచ్చిన లక్నోలోని పార్క్ ప్రారంభ కార్యక్రమానికి ములాయం అమర్ సింగ్‌ను ఆహ్వానించారు.
ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమమని, ములాయం సింగ్ ఆహ్వానంతో తాను ఇందులో పాల్గొంటున్నానని, తాను జ్ఞానేశ్వర్‌జీతో కలిసి పనిచేశానని, తాను ఆయనకు అనుచరుడినని అమర్ సింగ్ అన్నారు. అమర్ సింగ్‌కు బద్ధ శత్రువైన ఆజం ఖాన్ కూడా మంగళవారంనాడు జరిగిన ఈ కార్యక్రమానికి రాలేదు.












Click it and Unblock the Notifications