స్కెచ్చేసి, ఏమార్చి ముంబై డ్యాన్సర్‌పై రేప్ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సామూహిక అత్యాచారానికి గురైన ముంబయి డ్యాన్సర్ కేసును పోలీసులు చేధించారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే సిసిఎస్ పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితుల్లో నగరానికి చెందిన ఈవెంట్ మేనేజర్ హ్యాపీ అలియాస్ నితిన్ యాదవ్, అలీ అలియాస్ అజయ్ శర్మ, నిజామాబాద్‌కు చెందిన వెంకటరాజు, హరికృష్ణలుగా గుర్తించారు.
పట్టుబడ్డ నిందితులను శనివారం సాయంత్రం నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ సమక్షంలో మీడియా ముందు ప్రవేశ పెట్టారు. కాగా, ఈ కేసులో మరో నిందితుడు పోలీసుల ఎదుట ఆదివారం సాయంత్రం లొంగిపోయాడని తెలుస్తోంది. డ్రైవర్ రాజు బోయినపల్లి పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు.

డ్యాన్సర్ 1
కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పిన వివరాల ప్రకారం, నగరానికి చెందిన ఈవెంట్ మేనేజర్ హ్యాపీ అలియాస్ నితిన్ యాదవ్ డిసెంబర్ 31 వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమం కోసం ముంబయికి చెందిన నర్తకితో ఒప్పందం కుదుర్చుకుని నగరానికి రప్పించాడు.

డ్యాన్సర్ 2
ఆ నర్తకి డిసెంబర్ 31న సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయం నుంచి హ్యాపీ, అలీ అలియాస్ అజయ్ శర్మ, వెంకటరాజు, హరికృష్ణ కలిసి నర్తకిని కూకట్‌పల్లి సమీపంలోని నిజాంపేటలోని వెంకటరాజు ఇంటికి తీసుకెళ్లారు.

డ్యాన్సర్ 3
నిజాంపేటలో ఎటిఎం సెంటర్‌లో నర్తకి డెబిట్ కార్డు నుంచి 57వేలు డ్రా చేసి మద్యం, కూల్ డ్రింక్స్, స్నాక్స్ తీసుకున్నారు. అక్కడి నుంచి వెంకట రాజు అద్దెకుంటున్న ఇంటికి తీసుకెళ్లారు. దుండగుల ముందస్తు ప్రణాళికలో భాగంగా నర్తకి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించారు. నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

డ్యాన్సర్ 4
అనంతరం జనవరి 2న పటాన్‌చెరులో ఓ ప్రైవేట్ బస్సు ఎక్కించి ముంబయికి పంపించారు. నర్తకి తనపై జరిగిన అత్యాచారంపై ఈ నెల 7న ముంబయి పోలీసులను ఆశ్రయించగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కేసును శుక్రవారం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు అందించారు.

డ్యాన్సర్ 5
పోలీసులు బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఎటిఎం సెంటర్ పుటేజీలను సేకరించి నిందితుడ్ని వెంకటరాజుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్వారా మొత్తం వివరాలను సేకరించి అలీని శనివారం అరెస్ట్ చేశారు.

డ్యాన్సర్ 6
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సామూహిక అత్యాచారానికి గురైన ముంబయి డ్యాన్సర్ కేసును పోలీసులు చేధించారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే సిసిఎస్ పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేశారు.

డ్యాన్సర్ 7
నిందితుల్లో నగరానికి చెందిన ఈవెంట్ మేనేజర్ హ్యాపీ అలియాస్ నితిన్ యాదవ్, అలీ అలియాస్ అజయ్ శర్మ, నిజామాబాద్‌కు చెందిన వెంకటరాజు, హరికృష్ణలుగా గుర్తించారు. ముందే పథకం వేసి, నృత్య ప్రదర్శన పేరుతో ఏమార్చి అత్యాచారం చేశారు.












Click it and Unblock the Notifications