Video: సీటు కోసం లోకల్ రైలులో జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు
ముంబై: చిన్న చిన్న విషయాల కోసం అనవసర ఆవేశంతో ఘర్షణ పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. ఇలాంటి ఘటనే ముంబై లోకల్ ట్రైన్‌లో చోటు చేసుకుంది. సీటు కోసం కొందరు మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు. వారిని ఆపేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు.
థానే-పాన్వెల్ లోకల్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళల కంపార్ట్‌మెంట్‌లో ఓ మహిళ కూర్చునేందుకు ప్రయత్నించగా.. మరికొందరు మహిళలు ఆమెను అడ్డుకున్నారు. తాము కూర్చుంటామని గొడవ పెట్టుకున్నారు. దీంతో ఇరువైపులా మహిళలు జుట్లు పట్టుకుని తీవ్రంగా కొట్టుకున్నారు.

అయితే, ఈ వివాదాన్ని ఆపేందుకు ఓ మహిళా కానిస్టేబుల్ విఫల ప్రయత్నం చేశారు. మహిళల ఘర్షణను సద్దుమణిగేందుకు ప్రయత్నించిన లేడీ కానిస్టేబుల్‌ను కూడా తోసేయడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీటు విషయమై కొందరు మహిళలు లోకల్ రైలులో తీవ్రంగా కొట్టుకున్నారని, వారిని ఆపేందుకు ప్రయత్నించిన లేడీ కానిస్టేబుల్ కూడా గాయపర్చారని సీనియర్ రైల్వే పోలీసు అధికారి ఎస్ కటారే తెలిపారు.
Women commuters fight over seat in Mumbai local train.#Mumbai pic.twitter.com/7mSDfqdoEY
— Suresh Kumar (@journsuresh) October 7, 2022
కాగా, ఈ మహిళల ఘర్షణ పడుతున్న సమయంలో కొందరు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. సీటు కోసం ఇంత గొడవ పడాలా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications