దారుణం: రియల్టర్‌ను వెంటాడి కాల్చి చంపారు
గుర్గావ్: గుర్గావ్‌లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిని తుపాకితో కాల్చి చంపారు. గుర్గావ్‌లోని సెక్టార్ - 5 సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో మంగళవారం రాత్రి దాదాపు పదిన్నర గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
నలుగురు ఆగంతకులు రెండు బైకులపై పెట్రోల్ బంకులోకి ప్రవేశించారు. ఓ బైకు వెనక కూర్చున్న వ్యక్తి మొదట కాల్పులు ప్రారంభించాడు. రెండో బైకుపై వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు అప్పటికే వారి దగ్గర ఉన్న రివాల్వర్‌తో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని వెంబడించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

దాంతో రియల్టర్ అక్కడిక్కకడే కుప్పకూలిపోయి మరణించాడు. కాల్పులు జరిపిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమీపంలోని వ్యక్తుల వద్ద కూడా రైఫిల్స్ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
సంఘటన జరిగిన తీరును బట్టి ఈ హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు అనుమానిస్తున్నారు. మృతుడిని రియల్టర్ రాజు (32)గా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోని గొడవలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. సిసిటివీ కెమెరాల్లో ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి.












Click it and Unblock the Notifications