బెంగళూరు సిటీ బస్సులో దారుణహత్య, ఆంధ్రప్రదేశ్ తండ్రి, కోడుకులు అరెస్టు !

బెంగళూరు: బెంగళూరు నగరంలో బీఎంటీటీ బస్సులు ప్రతిరోజు వేల సంఖ్యలో సంచరిస్తుంటాయి. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే బస్సులో అతిదారుణంగా హత్య చేసిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన తండ్రి, కుమారులను బెంగళూరులోకి ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెంది పాలబ్రహ్మాయ్య (60), అతని కుమారులు అభిషేక్ (32), ధనరాజ్ (24) అనే ముగ్గురిని అరెస్టు చేశామని సోమవారం పోలీసులు చెప్పారు. ఫిబ్రవరి 21వ తేదీ బెంగళూరు నగరం లోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని కూనప్పన అగ్రహార పమీపంలో కదులుతున్న బస్సులో సురేష్ (46) దారుణ హత్యకుగురైనాడు.

Murder in BMCT bus three arrested by Bengaluru electronic city police

దాదాపు 60 మంది ప్రయాణికులు చూస్తున్న సమయంలో బస్సులోనే సురేష్ హత్యకుగురైనాడు. అరెస్టు అయిన పాలబ్రహ్మాయ్య, హత్యకుగురైన సురేష్ ఒకే ఇంటిలో అక్కచెల్లెళ్లను వివాహం చేసుకున్నారు. 1991 నుంచి వీరిద్దరూ దారి దోపిడీలు చేస్తున్నారు.

దోపిడీలు చేసిన సమయంలో చిక్కిన వస్తువులు భాగం పెట్టుకునే విషయంలో పాలబ్రహ్మాయ్య, సురేష్ ల మద్య గొడవలు వచ్చాయి. తరువాత ఇద్దరూ వేరువేరుగా దారిదోడీలు చేస్తున్నారు. ఈ విషంలో కక్షపెంచుకున్న పాలబ్రహ్మాయ్య తమిళనాడులోని గుడియాతం పోలీసులుకు సురేష్ ను పట్టించాడు.

సురేష్ జైలుకు వెళ్లిన తరువాత అతని సోదరుడు సాయికుమార్ ఆంధ్రప్రదేశ్ లోని కడప పోలీసులకు పాలబ్రహ్మాయ్యను పట్టించాడు. కొన్ని నెలల క్రితం సురేష్, పాలబ్రహ్మాయ్య బెయిల్ మీద బయటకు వచ్చారు. ఫిబ్రవరి 21వ తేదీన మళ్లీ తమ మీద పోలీసులకు సమాచారం ఇవ్వడానికి సురేష్ వెలుతున్నాడని వీరికి అనుమానం వచ్చింది.

సురేష్ ను వెంబడించిన తండ్రి, కుమారులు సురేష్ ను దారుణంగా హత్య చేశారు. మొబల్ చోరీ కేసులో పాలబ్రహ్మాయ్యను అరెస్టు చెయ్యగా సురేష్ హత్య కేసు విషయం బయటకు వచ్చిందని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+