బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫస్ట్‌టైమ్: శ్వాస తీసుకోలేకపోతున్నా..ఊపిరి స్తంభించింది: పునీత్ కన్నుమూతపై సుదీప్ ఎమోషనల్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కన్నడ చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్‌గా వెలుగొందుతోన్న పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం ఎందరినో కలిచి వేస్తోంది. ఆయన ఇక లేడనే విషయాన్ని కోట్లాదిమంది జీర్ణించుకోలేకపోతున్నారు. కడసారి వీడ్కోలు పలకడానికి బెంగళూరుకు తరలి వస్తోన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఆయన పార్థివదేహాన్ని ఉంచిన కంఠీరవ స్టేడియం జనసంద్రంగా మారింది. అర్ధరాత్రయినా.. వర్షం పడినా లెక్క చేయట్లేదు. తాము ఆరాధించే హీరోను చివరిసారిగా చూడటానికి పోటెత్తుతున్నారు.

వాటికన్ సిటీలో ప్రధాని మోడీ: పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ: వెంట.. అజిత్ ధోవల్వాటికన్ సిటీలో ప్రధాని మోడీ: పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ: వెంట.. అజిత్ ధోవల్

 కంఠీరవ స్టూడియోలో..

కంఠీరవ స్టూడియోలో..

ఈ సాయంత్రం పునీత్ రాజ్‌కుమార్ పార్థివకాయానికి అంత్యక్రియలను నిర్వహిస్తారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించదలిచింది కర్ణాటక ప్రభుత్వం. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. కంఠీరవ స్టూడియోలో ఈ అంత్యక్రియలు జరుగుతాయి. తండ్రి రాజ్‌కుమార్, తల్లి పార్వతమ్మ సమాధుల వద్దే పునీత్ పార్థివ దేహానికి అంత్యక్రియలను నిర్వహిస్తారు. తల్లిదండ్రుల సమాధుల వద్ద శాశ్వతంగా నిద్రిస్తారు.

సుదీప్ ఎమోషన్ స్టేట్‌మెంట్

సుదీప్ ఎమోషన్ స్టేట్‌మెంట్

పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత పట్ల ప్రముఖ హీరో కిచ్చ సుదీప్ తొలిసారిగా స్పందించారు. ఈ విషయం తెలిసే సమయానికి ఆయన సుదీప్ బెంగళూరులో లేరు. అవుట్ డోర్ షూటింగ్‌లో ఉన్నారు. ఈ ఉదయమే ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. అందుకే శుక్రవారం నాడు ఆయన ఎక్కడా కనిపించలేదు. పునీత్ అన్న శివ రాజ్‌కుమార్, యష్, దర్శన్, విజయ్ రాఘవేంద్ర, గణేష్ వంటి స్టార్ హీరోలు విక్రమ్ ఆసుపత్రికి వచ్చినప్పటికీ.. సుదీప్ రాలేదు.

అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కిచ్చ

అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కిచ్చ

పునీత్ రాజ్‌కుమార్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఓ నోట్ విడుదల చేశారు. చిన్నప్పటి నుంచి పునీత్‌తో తనకు పరిచయం ఉందని చెప్పారు. తమ రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉందని పేర్కొన్నారు. తొలిసారిగా పునీత్‌ను తాను శివమొగ్గలో కలిశానని, అప్పటి నుంచి ఆయనతో గడిపిన ప్రతిక్షణాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తూ వచ్చానని వ్యాఖ్యానించారు. పునీత్ ఒక గొప్ప స్నేహితుడు మాత్రమే కాదని, చిత్ర పరిశ్రమలో తనకు గట్టి పోటీదారుడని చెప్పారు.

 గొప్ప మానవతావాది..

గొప్ప మానవతావాది..

ఓ గొప్ప నటుడు, డాన్సర్, ఫైటర్.. అంతకుమించి అత్యుత్తమ మానవతావాది అని సుదీప్ అన్నారు. అలాంటి నటుడితో ఇండస్ట్రీని పంచుకోవడం తన అదృష్టమని, గర్వకారణమని చెప్పారు. పునీత్ చేసిన సాహసాలు, తీసుకున్న నిర్ణయాలు.. చలన చిత్ర పరిశ్రమను మలుపు తిప్పాయని, ఇక ముందు అలాంటి చర్యలు ఎవరు తీసుకుంటారనేది సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అసంపూర్తిగా చిత్ర పరిశ్రమ..

అసంపూర్తిగా చిత్ర పరిశ్రమ..

పునీత్ లేని చిత్ర పరిశ్రమను ఊహించుకోలేనని సుదీప్ వ్యాఖ్యానించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అసంపూర్తిగా మిగిలి పోతుందని అన్నారు. పునీత్ రాజ్‌కుమార్ విషయంలో కాలం అత్యంత క్రూరంగా వ్యవహరించిందని అన్నారు. ప్రకృతి సైతం పునీత్ మరణానికి నివాళి అర్పిస్తోందని చెప్పారు. తాను బెంగళూరులో ల్యాండ్ అవుతుంటే.. ఎప్పుడూ లేని ఓ బాధాకర, ఆవేదన భరిత వాతావరణం కనిపించిందని, ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని అన్నారు.

 బెంగళూరులో ఆవేదన భరిత వాతావరణం..

బెంగళూరులో ఆవేదన భరిత వాతావరణం..

అత్యంత బాధాతప్త హృదయంతో తాను బెంగళూరులో దిగానని, కంఠీరవ స్టేడియానికి వెళ్తోంటే మనసు భారంగా మారిందని చెప్పారు. తొలిసారిగా.. తన శ్వాస పీల్చడం కష్టతరమైందని, ఊపిరి తీసుకోలేకపోతున్నానంటూ సుదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిలో పునీత్‌ను చూడాల్సి వస్తుందని, తాను ఊహించనేే లేదని అన్నారు. శాశ్వతంగా నిద్రపోతున్న పునీత్‌.. ప్రతి ఒక్కరి గుండెనూ కొండంత భారంగా మార్చివేశాడని చెప్పారు.

అంత్యక్రియల్లో..

అంత్యక్రియల్లో..

పునీత్ లేడనే చేదు నిజాన్ని జీర్ణించుకోవడానికి ప్రతి ఒక్కరికీ సుదీర్ఘ సమయం పడుతుందని అన్నారు. చిత్ర పరిశ్రమలో, ఆయన చేసిన సమాజ సేవలను ఎవరూ భర్తీ చేయలేరని, అది అలా అసంపూర్తిగా ఉండి పోతుందని సుదీప్ చెప్పారు. పునీత్ పార్థివ దేహానికి నిర్వహించే అంత్యక్రియల్లో సుదీప్ పాల్గొంటారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఆ అంతిమయాత్రలో పాల్గొంటుంది.

English summary
"My breath became heavier"-Actor Sudeep emotional words learning Puneeth Rajkumar is no more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X