వ్యక్తిగతం, మద్దతిస్తా: దిగ్విజయ్ అఫైర్‌పై తనయుడు

భోపాల్: టీవీ జర్నలిస్టు అమృతా రాయ్‌తో దిగ్విజయ్ సింగ్ సంబంధంపై ఆయన కుమారుడు, కాంగ్రెసు శాసనసభ్యుడు జయవర్ధన్ సింగ్ ప్రతిస్పందించారు. అది వ్యక్తిగతమని, తాను తండ్రికి మద్దతు ఇస్తానని ఆయన గురువారంనాడు అన్నారు

అది పూర్తిగా వ్యక్తిగతమని, ఆ విషయంపై తాను మాట్లాడడానికి ఇష్టపడబోనని ఆయన పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. అయితే, తాను తన తండ్రికి పూర్తి మద్దతు ఇస్తానని మాత్రం చెప్పదలుచుకున్నానని ఆయన అన్నారు.

My father's relation is personal: Digvijay's son

అమృతా రాయ్‌తో తనకు గల సంబంధాన్ని దిగ్విజయ్ సింగ్ బుధవారంనాడు ట్విట్టర్‌లో అంగీకరించారు. ఆమెకు విడాకులు లభించిన తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పారు. అమృతా రాయ్ కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించారు.

అమెరికాలో విద్యనభ్యసించిన జయవర్ధన్ నిరుడు గుణ జిల్లాలోని రాఘోగఢ్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. దిగ్విజయ్ సింగ్ 1977లో మొదటి సారి ఇక్కడి నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+