ఇన్ఫోసిస్ రేప్ ట్విస్ట్: 'వాళ్లిద్దరు అసభ్యంగా ఉంటే ఫోటోలు తీశాడు'
పుణే: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ పుణే ప్రాంగణంలో మహిళపై జరిగిన అత్యాచారం కేసులో కొత్త మలుపు! తన పైన పరితోష్ అనే వ్యక్తి అత్యాచారం చేస్తుండగా కాపాడమని అరిస్తే, అక్కడకు వచ్చిన ప్రకాశ్ మహాదిక్ దానిని వీడియో తీశాడని బాధితురాలు ఆరోపించారు.
దీనిపై ప్రకాశ్ మహాదిక్ సతీమణి స్వప్న స్పందించారు. తన భర్తకు ఎలాంటి పాపం తెలియదని, అతడు నిర్దోషి అని పేర్కొన్నారు. వాళ్లిద్దరూ తప్పుగా ప్రవర్తిస్తుంటే, ఆ విషయాన్ని సీనియర్లకు ఫిర్యాదు చేసేందుకు దానిని ఫోటోలు తీశాడని చెప్పారు.
పరితోష్ అనే క్యాంటీన్ ఉద్యోగి ఇన్ఫోసిస్ ప్రాంగణంలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రకాశ్ మహాదిక్ ఆ సంఘటనను వీడియో తీశాడని బాధితురాలు ఆరోపించింది. దీంతో ఇద్దర్నీ పోలీసులు అరెస్టు చేశారు.

తన భర్త మహాదిక్‌ను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న స్వప్న పుణే వచ్చారు. వాళ్లిద్దరు టాయిలెట్‌లో అభ్యంతరక పరిస్థితిలో ఉండగా ఆధారం కోసం తన భర్త ఫోటోలు తీశాడని, ఆ విషయాన్ని వాళ్లకు చెప్పేలోగానే తప్పుడు కేసులో ఇరికించారని వాపోయారు. తన భర్త మహిళలను గౌరవిస్తారన్నారు.
గత వారం కూడా తమ ప్రాంతంలో తమ ప్రాంతంలో కొందరు యువకులు ఓ మహిళను ఏడిపిస్తుంటే వాళ్లను వారించాడని, నిజంగా తన భర్తే తప్పు చేస్తే శిక్షించుకోవచ్చని తెలిపారు.
క్యాంటీన్ బి3 భవనంలో ఉందని, అత్యాచారం మాత్రం బి12 భవనంలో జరిగిందని, క్యాంటీన్లోనే టాయిలెట్ ఉండగా, ఆ మహిళ అంత దూరం ఎవరూ లేని వేరే భవనంలోకి ఎందుకు వెళ్లవలసి వచ్చిందని మహాదిక్ సోదరుడు మహేంద్ర ప్రశ్నించారు.
తాను కూడా ఈ క్యాంపస్‌లో రెండేళ్ల పాటు పని చేశానని, తనకు ఈ ప్రదేశం గురించి చాలా బాగా తెలుసునని చెప్పారు. ఇక్కడ తన సోదరుడు ఆరేళ్లుగా పని చేస్తున్నారన్నారు.
బాగా పని చేస్తున్నందున అతను తన ఏజెన్సీ నుంచ పలుమార్లు అవార్డులు అందుకున్నాడని చెప్పారు. వారని ఫోటోలు తీయడం తప్పేనని, కానీ తన సోదరుడి ఇంటెన్షన్ మాత్రం తప్పుకాదన్నారు. అతను కనీసం బ్లాక్ మెయిల్ చేసేందుకు కూడా ఈ వీడియోలు తీయలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications