సింహాకు వణుకు మొదలైయ్యింది, మరోసారి చాన్స్ ఇస్తే హ్యాట్రిక్ నాదే, మోదీ ఏం చేస్తారో అని టెన్షన్!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల్లో నాయకుల మధ్య పొటీ ఎక్కువ అయ్యింది. ఇక సిట్టింగ్ ఎంపీలు సైతం మరోసారి ఎంపీగా పోటీ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తూ ఎలాగైనా టిక్కెట్ దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

కర్ణాటకలోని మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ టికెట్‌పై ఈసారి సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాకు దిగులుపట్టుకుంది. మైసూరు ఎంపీ ప్రతాప్ సింహాకు ఈసారి టిక్కెట్ దక్కదని ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కర్ణాటక రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ రాధామోహన్ దాస్ అగర్వాల్‌తో బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ప్రత్యేకంగా సమావేశం కావడం హాట్ టాపిక్ అయ్యింది.

Mysuru BJP MP Pratap Simha appealed to the BJP election in-charge to give him the MP ticket

మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గత రెండు సార్లు తాను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందానని ప్రతాప్ సింహా అంటున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ నాయకుడు రాధామోహన్ దాస్ అగర్వాల్ కు ప్రతాప్ సింహా చెప్పారని తెలిసింది. ప్రతాప్ సింహా ఆయన కృషితో ప్రజానాయకుడిగా ఎదిగారని మైసూరు ప్రజలు అంటున్నారు. అలాంటి ప్రజాప్రతినిధి ప్రతాప్ సింహాకు మరోసారి ఎంపీ టికెట్ వస్తుందనే చర్చ మొదలు అయ్యింది.

Mysuru BJP MP Pratap Simha appealed to the BJP election in-charge to give him the MP ticket

ప్రతాప్ సింహా కాకుండా మరో బీజేపీ నాయకుడికి ఎంపీ టిక్కెట్ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ కార్యకర్తలు పార్టీ విభేదాలు మరిచి ప్రతాప్ సింహాకు మద్దతు తెలుపుతున్నారు. మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా గురించి సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతోంది. మైసూరు సిట్టింగ్‌ ఎంపీ ప్రతాప్ సింహాకు ఈసారి టికెట్‌ లేదనే అంశం తెరపైకి రావడంతో స్వయంగా ప్రతాప్‌ సింహా కూడా ఉలిక్కిపడ్డారు.

ఇన్ని పరిణామాల మధ్య మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా బీజేపీ కర్ణాటక ఎన్నికల ఇన్‌ఛార్జ్ రాధామోహన్ దాస్ అగర్వాల్‌తో సమావేశం అయ్యారు. మైసూరు లోక్ సభ నియోజకవర్గ పరిస్థితి, నియోజకవర్గంలో తన పనితీరు, ప్రజాభిప్రాయ సేకరణ గురించి ప్రతాప్ సింహా సుదీర్ఘంగా ఆయనతో చర్చించారని తెలిసింది. రాధా మోహన్ దాస్ అగర్వాల్‌ను కలిసిన తర్వాత తన ఫేస్‌బుక్ ఖాతాలో ఫోటోను పోస్ట్ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా తాను రాధామోహన్ దాస్ అగర్వాల్‌ను కలిసి కేవలం ఒక గంట మాత్రమే చర్చించానని వివరించారు.

Mysuru BJP MP Pratap Simha appealed to the BJP election in-charge to give him the MP ticket

నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, ప్రధాని నరేంద్ర మోదీ లేకుండా నేను లేనని, తనకు మరోసారి ఎంపీ టికెట్ వస్తుందని ఆశిస్తున్నానని, ఎంటీ టిక్కెట్ రాకుంటే బీజేపీ కోసం పనిచేస్తానని, బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు అని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా పోస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. రాధమోహన్ దాస్ అగర్వాల్ ఎంపీ టిక్కెట్ నీకే వస్తుందని హామీ ఇచ్చి ఉంటే ఆయన మరోరకంగా పోస్టు చేసి ఉండేవారని బీజేపీ నాయకులు చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+