సినిమా తియ్యాలని నకిలి నోట్లు ప్రింట్

మైసూరు: నిర్మాతలుగా మారి కొత్తగా సినిమా నిర్మించాలని కలలు కంటూ ఏకంగా నకిలి నోట్లు ప్రింట్ చేసి చలామణి చేస్తున్న ఇద్దరిని మైసూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలోని మరో వ్యక్తి చాకచక్యంగా తప్పించుకున్నాడని పోలీసులు అన్నారు.

భరత్, లికేష్ అనే ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని గురువారం మైసూరు నగరంలోని ఉదయగిరి పోలీసులు చెప్పారు. గురువారం ఉదయం భరత్, లికేష్, తేజస్ అనే ముగ్గురు కల్యాణనగర్ లేఔట్ లో నకిలి నోట్లు చెలామణి చేస్తున్నారు.

Mysuru Police arrested two persons on Thursday

విషయం తెలుసుకున్న పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించడంతో తేజస్ తప్పించుకున్నాడు. మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తరువాత వీరి ఇంటిలో ప్రింటర్, ఇంక్, కాగితాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముగ్గురూ నటులు కావాలని ఆశపడ్డారు. అందుకు వీరే సొంతంగా సినిమా తియ్యాలని నిర్ణయించారు. డబ్బు సులభంగా సంపాదించాలని నకిలి నోట్లు ప్రింట్ చేస్తున్నారని పోలీసులు అన్నారు. నిందితుల నుంచి రూ. 100 నోట్ల విలువైన 110 నకిలి నోట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+