ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్ల మార్పునకు కేంద్రం ఆమోదం: ఇక ఈ పేర్లతో..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్ల మార్పునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్ల మార్పునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ నగారాన్ని ధారాశివ్‌గా పేర్లు మారుస్తూ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకన్న నిర్ణయానికి తాజాగా, కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. నగరాల పేర్ల మార్పుపై తమకెలాంటి అభ్యంతరం లేదని కేంద్రం తెలిపింది.
ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ జారీ చేసిన లేఖలను ఆయన పంచుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు దేవేంద్ర ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చిందని వ్యాఖ్యానించారు.

కాగా, ఈ రెండు నగరాల పేర్లు మార్చాలంటూ హిందూ సంఘాలు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రభుత్వం పడిపోయే ముందు ఈ రెండు నగరాల పేర్లను మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
➡️ औरंगाबादचे ‘छत्रपती संभाजीनगर’,
— Devendra Fadnavis (@Dev_Fadnavis) February 24, 2023
➡️ उस्मानाबादचे ‘धाराशिव’ !
राज्य सरकारच्या निर्णयाला केंद्र सरकारची मंजुरी !
मा. पंतप्रधान नरेंद्र मोदीजी आणि केंद्रीय मंत्री मा. अमितभाई शाह यांचे कोटी-कोटी आभार!
मुख्यमंत्री @mieknathshinde जी यांच्या नेतृत्त्वातील सरकारने ‘करुन दाखविले’...! pic.twitter.com/IfXbdFec7r
అయితే, ఆ తర్వాత బీజేపీ సహకారంతో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసి.. ఈ నగరాల పేర్ల మార్పుపై తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి శుక్రవారం కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఆ రెండు నగరాల పేర్లు మారనున్నాయి.












Click it and Unblock the Notifications