మమతకు ‘నారద’ స్టింగ్ ఆపరేషన్ షాక్: సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే రోస్‌వ్యాలీ కుంభకోణంలో ఇద్దరు టీఎంసీ ఎంపీలు హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు పార్లమెంటేరియన్లు, మంత్రులు భారీగా ముడుపులు అందుకున్నట్లు నారదన్యూస్‌.కామ్‌ చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడైంది.

కాగా, కలకత్తా హైకోర్టు దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. చీఫ్‌ జస్టిస్‌ నిషితా మహత్రే, జస్టిస్‌ టి.చక్రవర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 72 గంటల్లోగా సీబీఐ దీనిపై ప్రాథమిక విచారణ జరిపి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

Narada sting case: Will approach SC, says Mamata

'ముడుపులు తీసుకున్నట్లు మంత్రులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర పోలీసులు తోలుబొమ్మల్లా మారారు. అందుకే దీనిపై సత్వర విచారణ జరిపేందుకే సీబీఐ విచారణకు ఆదేశించాం' అని న్యాయస్థానం పేర్కొంది. నారద స్టింగ్‌ ఆపరేషన్‌పై హైకోర్టు సీబీఐ విచారణ జరిపించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. న్యాయస్థానం ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని మమత తెలిపారు.

కాగా, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన మూడో అతిపెద్ద కుంభకోణం ఇది. శారదా, రోస్‌వ్యాలీ కుంభకోణం తర్వాత ఇందులో తృణమూల్‌ నేతలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2016 పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు భారీగా ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై నారదాన్యూస్‌ స్టింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది.

టీఎంసీకి చెందిన ఆరుగురు ఎంపీలు, ముగ్గురు మంత్రులు, కోల్‌కతా మేయరు డబ్బులు తీసుకున్నట్లు ఈ ఆరోపణలు వచ్చాయి. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఉంది. కాగా, టీఎంసీకి చెందిన లోక్‌సభ ఎంపీలు సుదీప్‌ బందోపాధ్యాయ, టపాస్‌ పౌల్‌ రోస్‌వ్యాలీ కుంభకోణంలో రూ.15వేల కోట్ల వరకు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో వారిద్దరినీ సీబీఐ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. శారదా స్కాంలోనూ పలువురు టీఎంసీ ఎంపీలు, మంత్రులపై కేసులు నమోదయ్యాయి, అరెస్టయ్యారు కూడా.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a potential blow to West Bengal Chief Minister Mamata Banerjee, the Calcutta high court on Friday ordered the Central Bureau of Investigation to conduct a preliminary probe into the Narada sting operation in which prominent leaders of the ruling Trinamool Congress were purportedly seen taking wads of currency notes.
Please Wait while comments are loading...