మాట్లాడుతుండగా పేలిన ఐఫోన్: తప్పించుకున్నాడు
గుర్గావ్: చైనా ఫోన్లు పేలుతున్నాయనే వార్తలు తరచూ చూస్తూనే ఉన్నాం. కానీ, ఇక్కడ అత్యంత విలువైన ఐఫోన్ కూడా పేలిపోయింది. ఈ ఘటనలో ఓ యువ వ్యాపారవేత్త పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతని వేలికి చిన్న గాయమైంది.
వివరాల్లోకి వెళితే.. కిషన్ యాదవ్ అనే వ్యక్తి తన ఐఫోన్ 6లో మాట్లాడుతుండగా.. ఫోన్లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన అతడు ఫోన్‌ను దూరంగా విసిరేశాడు. ఆ తర్వాత సెకన్ల తేడాతో ఆ ఫోన్ పేలిపోయింది.

దీనిపై ఫిర్యాదు చేసిన కిషన్ యాదవ్.. పేలిపోయిన ఫోన్‌ను ఐఫోన్ కస్టమర్ కేర్ సెంటర్‌కు అప్పగించాడు. కాగా, తమ ఫోన్ పేలిపోయిన ఘటనపై ఐఫోన్ తయారీదారు ఆపిల్ స్పందించినట్లు తెలిసింది. ఫిర్యాదును పరిశీలిస్తామని కంపెనీ అధికారి ఒకరు తెలిపినట్లు సమాచారం.
కాగా, కొన్నేళ్ల కిందట అమెరికాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. లాంగ్ ఐలాండ్‌లో ఓ వ్యక్తి జేబులో ఉన్న ఐఫోన్ పేలిపోయింది. దీంతో అతడికి యాలయ్యాయి. భారత్‌లో అధిక డిమాండ్ ఉన్న, అత్యున్నత ప్రమాణాలతో తయారుచేసిన ఐఫోన్ 6 పేలడంతో పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications