హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నాయబ్ సింగ్ సైనీ ఎన్నిక: రేపు సీఎంగా ప్రమాణం
ఛండీగఢ్: ఇటీవల అసెంబ్లీ ఎన్నిలకల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నాయబ్ సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చండీగఢ్‌లో బుధవారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు నాయబ్ సింగ్ సైనీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కేంద్ర పరిశీలకులుగా సమావేశానికి హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తదితరులు నాయబ్ సింగ్ సైనీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ.. నాయబ్ సింగ్ సైనీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హర్యాలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 15 ఏళ్ల పాటు ఇక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. ఎన్నికల సమయంలో ఏ విషయాన్నీ ప్రతిపక్షం వదిలిపెట్టలేదు. అగ్నివీర్లకు సంబంధించి తప్పుడు ఊహాగానాలు సృష్టించింది. ప్రతి అగ్నివీర్‌కు పెన్షన్‌తో కూడిన ఉద్యోగాన్ని ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.

మరోవైపు, నాయబ్ సింగ్ సైనీ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ విధానాలపై విశ్వాసం ఉంచారని తెలిపారు. అందుకే మూడోసారి బీజేపీ ప్రభుత్వానికి జై కొట్టారన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాని మోడీ దార్శనికతను ముందుకు తీసుకెళ్తామన్నారు.
VIDEO | "Nayab Singh Saini has been elected as leader of the legislative party. We will again form the government in Haryana, the double-engine government will be here for 15 years. In the leadership of Manohar Lal Khattar, many development works were carried out in Haryana,"… pic.twitter.com/Lt1ATcNOwb
— Press Trust of India (@PTI_News) October 16, 2024
ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటు అనుమతి ఇవ్వాల్సిందిగా నాయబ్ సింగ్ సైనీ.. రాజ్‌భవన్‌కు వెళ్లి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కోరారు. ఆ సమయంలో ఆయన వెంట అమిత్ షాతోపాటు పలువురు నాయకులు ఉన్నారు. కాగా, నాయబ్ సింగ్ సైనీ గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పలువురు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
#WATCH | Panchkula: Haryana BJP leaders offer jalebi to caretaker Chief Minister Nayab Singh Saini after he was chosen as the leader of BJP legislature party
— ANI (@ANI) October 16, 2024
He will take oath as Haryana CM for the second consecutive time tomorrow, October 17. pic.twitter.com/oRi38DRI08
మరోవైపు, ఎన్డీఏలో మిత్రపక్షమైన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలిసింది. కాగా, ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గానూ బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది.












Click it and Unblock the Notifications