NCP Crisis : అజిత్ బ్యాచ్ పై ఎన్సీపీ చర్యలు మొదలు-ఇద్దరు ఎంపీలు, 9 ఎమ్మెల్యేలపై వేటుకు...
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరుగుబాటు, ఫిరాయింపుతో మొదలైన రాజకీయ సంక్షోభం ఆ పార్టీని కుదిపేస్తోంది. రాత్రికి రాత్రే ఎన్సీపికి హ్యాండ్ ఇచ్చిన ఎన్డీయే సర్కార్ లో చేరిపోయిన అజిత్ పవార్.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం కూడా చేసేసారు. ఇవాళ తన మద్దతుదారులకు 8 మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఎన్సీపీ చర్యలకు దిగింది.
ముందుగా అజిత్ పవార్ తో పాటు వెళ్లి ఆయన ప్రమాణస్వీకారానికి హాజరైన ముగ్గురు కీలక నేతలపై ఎన్సీపీ వేటు వేసింది. వీరిలో ముంబై డివిజనల్ ఎన్‌సిపి చీఫ్ నరేంద్ర రాథోడ్, అకోలా సిటీ జిల్లా చీఫ్ విజయ్ దేశ్‌ముఖ్, రాష్ట్ర మంత్రి శివాజీరావు గార్జే ఉన్నారు. వీరు ముగ్గురూ అజిత్ పవార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మరో ఇద్దరు ఎంపీలు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరేపై తక్షణం అనర్హత వేటు వేయాలని కోరుతూ పార్టీ ఛీఫ్, తన తండ్రి శరద్ పవార్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఓ లేఖ రాశారు.

పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా, సమ్మతి లేకుండా ఈ ఫిరాయింపులు చాలా రహస్యంగా జరిగాయని, ఇది పార్టీని వీడటమే కాకుండా అనర్హత కిందకు వస్తుందని సుప్రియా సూలే లేఖలో తెలిపారు. ఎన్సీపీ లక్షణాలు, భావజాలం లేని ఇలాంటి వారిని తక్షణం పార్టీ నుంచి బహిష్కరించాలని ఆమె సూచించారు. అనంతరం పార్టీ నేతలు సమావేశమై అజిత్ పవార్ తో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఓ తీర్మానం ఆమోదించారు.

ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తక్షణం తమ పార్టీ రిజిస్టర్ నుంచి అజిత్ పవార్ కు సహకరించిన ఇద్దరు ఎంపీలు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే పేర్లు తొలగించాలని ఆదేశిస్తున్నట్లు ఓ ట్వీట్ చేశారు. తద్వారా వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే సూచన ఆధారంగా పవార్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే లోక్ సభతో పాటు అసెంబ్లీలోనూ స్పీకర్లకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎన్సీపీ లేఖలు సమర్పిస్తోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications