బిహార్ ఎన్నికల ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే..!
బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 122 స్థానాలు రావాలి. కాగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం National Democratic Alliance (ఎన్డీయే) కూటమి ముందంజలో దూసుకుపోతుంది. ఎన్డీయే ఇప్పటివరకు 130 స్థానాల్లో ముందుగా ఉండగా.. అధికారాన్ని దక్కించుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 156 స్థానాలను దాటేసింది. దీంతో బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ.. బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు విపక్ష మహాఘట్‌బంధన్ 82 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. అయితే సర్వేలు చెప్పినట్లుగానే ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోండగా.. మహాఘట్‌బంధన్ అంచనాలు తల్లకిందులయ్యాయి. పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఎన్డీఏ ముందంజలో ఉండగా, ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపులోనూ అదే జోరు కొనసాగింది.

కాగా రాష్ట్రం లోని 38 జిల్లాల్లో 46 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో తుది ఫలితం వెల్లడికానుంది. మొత్తం 2616 మంది అభ్యర్థుల భవిత్యవం తేలిపోనుంది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా అధికారంలోకి రావడానికి 122 స్థానాల్లో గెలవాలి. అయితే గతసారి కంటే 9.62 శాతం అధికంగా ఈసారి పోలింగ్ నమోదైంది. 67.13శాతం ఓటింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించింది.
కీలక నేతల స్థానాలివే..
తేజస్వీ యాదవ్- ఆర్జేడీ (రాఘోపుర్)
సామ్రాట్ చౌదరీ- భాజపా (తారాపుర్)
విజయ్ కుమార్ సిన్హా- భాజపా (లఖిసరాయ్)
మైథిలీ ఠాకుర్- భాజపా (అలీనగర్)
ప్రేమ్‌కుమార్ - భాజపా (గయా టౌన్)
తేజ్‌ప్రతాప్ యాదవ్- జేజేడీ (మహువా)
బిజేంద్ర ప్రసాద్ యాదవ్- జేడీయూ (సుపౌల్)
తార్‌కిశోర్ ప్రసాద్- భాజపా (కఠిహార్)
రాజేశ్ కుమార్ - కాంగ్రెస్ (కుటుంబ)
మరోవైపు బీహార్‌లో కౌంటింగ్ వేళ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఓట్ చోరీ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు మాణిక్కం ఠాగూర్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు సంబంధించిన 65 లక్షల ఓట్లు తొలగించారని ట్వీట్ చేశారు. ఇంక ఫలితాలు ఏం ఆశిస్తాం అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు. మ్యాచ్‌కు ముందే ఫిక్సింగ్ జరిగితే ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది ట్వీట్ చేశారు. ఇప్పటికే పలుకౌంటింగ్ కేంద్రాల దగ్గర నిరసనలు కొనసాగుతున్నాయి.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications