నా లెక్క 160.. ఇన్ని సీట్లు ఎలా వచ్చాయబ్బా: నోరెళ్ల బెట్టిన అమిత్ షా..!!
జనతాదళ్ (యునైటెడ్) అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చరిత్ర సృష్టించారు. మరో విడత బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతోండటం ఇది వరుసగా అయిదోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రికార్డును బ్రేక్ చేయనున్నారు. ఈ నెల 15 లేదా 18వ తేదీన నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ ప్రభంజనం సృష్టించింది ఎప్పట్లాగే. ఎన్డీఏ 200 నియోజకవర్గాలను అందుకుంది. మొత్తం 75 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 20 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న జేడీయూకు క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందనే వార్తలు వెలువడినప్పటికీ.. ఈ ఫలితాలను బట్టి చూస్తోంటే..అవన్నీ కూడా పటాపంచలయ్యాయి. రికార్డు స్థాయిలో భారీ మెజారిటీని సాధిస్తోన్నారు జేడీయూ అభ్యర్థులు.

ఈ స్థాయి ఘన విజయాన్ని చివరికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి కూడా అంచనా వేయలేకపోయారు. ఈ ఎన్నికల్లో తాము అమిత్ షా 160 సీట్లకు పైగా గెలుస్తామని గతంలో ప్రకటించారు గానీ, దాన్ని అవలీలగా అందుకుంది ఎన్డీఏ. ఇప్పుడు ఏకంగా 200 స్థానాలను తన ఖాతాలో వేసుకుంటోంది. అమిత్ షా వేసిన అంచనాలకు 40 సీట్లు అదనంగా వచ్చినట్టే. బీజేపీ 91 సీట్లు, జేడీయూ 81 సీట్లలో ముందంజలో ఉన్నాయి.
చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్‌జెపి (రామ్ విలాస్) 22, జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తాన్ ఆవామీ లీగ్ నాలుగు సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ కూటమి ఫలితాలు అమిత్ షా బహిరంగంగా ప్రకటించిన బెంచ్‌మార్క్‌ను మించిపోయాయి. మరోవైపు, మహాఘట్‌బంధన్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ మరోసారి చేతులెత్తేసింది. కూటమి కూసాలు కదిలిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 114 సీట్లు గెలుచుకున్న ఆర్జేడీ ప్రస్తుతం 32 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై తేజశ్వి యాదవ్ విస్తృత ప్రచారం చేసినప్పటికీ ఈ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ బలహీనమైన ప్రదర్శన కూటమికి నిరంతర సమస్యగా మారింది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికలు కూడా అదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. కాంగ్రెస్ 61 సీట్లలో పోటీ చేసి కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మహాఘట్‌బంధన్‌లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగడంలో పార్టీ వైఫల్యాన్ని ఇది స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications