ఎన్‌డీఎఫ్‌బీ తీవ్రవాది అరెస్ట్: జమ్మూలో కాల్పులు ముగ్గురు మృతి
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎన్‌డీఎఫ్‌బీ(ఎస్) తీవ్రవాది అరెస్టు అయ్యాడు. అదుపులోకి తీసుకున్న తీవ్రవాదిని బెంగళూరు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తరలించారు. అనంతరం తీవ్రవాదిని పోలీసులు విచారిస్తున్నారు.
బెంగళూరులో తీవ్రవాది పట్టుబడటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
సరిహద్దులో ఎదురుకాల్పులు: ముగ్గురు మృతి

జమ్మూకాశ్మీర్‌లోని ట్రాల్‌లో సైన్యానికి, ఉగ్రవాదులకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు, ఓ భారత సైనికాధికారి మృతి చెందారు. మరో జవానుకు గాయాలయ్యాయి.
రాజస్థాన్‌లో కూలిన మిగ్ విమానం
రాజస్థాన్‌లో మిగ్-27 విమానం కూలిపోయింది. బర్మెర్‌కు సమీపంలోని మలబార్ గ్రామాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పైలట్ మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పైలట్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications