నేపాల్ భూకంపం: ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్‌కు మోడీ ప్రశంసలు, టికెట్ ధర తగ్గించిన ఎయిరిండియా
న్యూఢిల్లీ: నేపాల్‌లో సంభవించిన పెను భూకంపం నేపాల్ రాజధాని ఖాఠ్మండుని అతలాకుతలం చేసింది. నేపాల్ అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సుమారు 3,200 మంది వరకు మరణించారు. అయినా మొక్కవోని ధైర్యంతో నేపాల్ ప్రజలు తమ ఆప్తుల కోసం వెతుకులాట సాగిస్తూనే, క్షతగాత్రులను ఆసుపత్రులకు చేరవేస్తున్నారు.
భూకంపం నేపాల్ ప్రజల జీవనవిధానాన్నే ఒక్కసారి మార్చేసింది. తినడానికి తిండి, పడుకోవడానికి గూడు లేకపోయినా, ప్రజలంతా రోడ్లపైనే నివసిస్తున్నారు. దీంతో నేపాలీల ధైర్యాన్ని చూసిన ప్రధాని మోడీ వారిలో మరికొంత ధైర్యాన్ని నింపే విధంగా ట్విట్టర్‌లో ట్వీట్స్ చేశారు.
నేపాల్‌లో పరిస్ధితులు సాధారణ స్ధాయికి వచ్చేదాకా భారత్ సహాయం అందిస్తుందని ఆయన ప్రకటించారు. నేపాల్‌లో భారత్ తరుపున సాయం అందిస్తోన్న ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, డాక్టర్లు, వాలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ సంస్కృతి 'సేవా పర్మ ధర్మహాః' అని చెబుతుందని దానికి అనుగుణంగా నేపాలీలకు సాయం అందించేందుకు ముందుకొచ్చిన 125 మంది కోట్ల భారతీయులకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు.

ఏప్రిల్ 25న నేపాల్‌లో రెక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంప ప్రమాదంలో 3200కుపైగా నేపాలీ ప్రజలు మరణించారు. భవనాలు, ఇళ్ల కింద శిథిలమైన పోయిన వారి మృతిదేహాలను ఇంకా వెలికితీస్తూనే ఉన్నారు.
To all those saying #ThankYouPM- appreciate the sentiment…real thanks should be to our great culture, which teaches us 'Seva Parmo Dharma'.
— Narendra Modi (@narendramodi) April 27, 2015 If we want to thank anyone, it should be the 125 crore people of India who have made Nepal's pain their own & extended all help.
— Narendra Modi (@narendramodi) April 27, 2015 We must thank our armed forces, NDRF teams, doctors & all those volunteers who are overcoming every obstacle to restore normalcy in Nepal.
— Narendra Modi (@narendramodi) April 27, 2015 Mention must be made of the media. They are bravely covering the disaster from the ground. Thanks!
— Narendra Modi (@narendramodi) April 27, 2015 And above all, we salute the resilience of our sisters & brothers in Nepal & parts of India, for their courage in the face of disaster.
— Narendra Modi (@narendramodi) April 27, 2015 నేపాల్‌కు టికెట్ ధరలను తగ్గించిన ఎయిరిండియా:
నేపాల్‌కు వెళ్లే ప్రయాణికులకు ఎయిరిండియా భారీగా టికెట్ ధరలను తగ్గించింది. ఢిల్లీ నుంచి నేపాల్‌కు వెళ్లే ప్రయాణికులకు టికెట్ ధర రూ . 14 వేల నుంచి రూ. 4,700 వరకు తగ్గించినట్లు ఎయిరిండియా ప్రకటించింది.












Click it and Unblock the Notifications