విద్యార్థినిని కౌగిలించుకునే యత్నం, ప్రొఫెసర్‌పై కేసు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అనుచితంగా ప్రవర్తించిన విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ జరుపుతున్నారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఇది జరిగింది. విద్యార్థిని కళాశాలలో పీహెచ్‌డీ చేస్తోంది. తనకు గైడ్‌గా ఉన్న సదరు ప్రొఫెసర్ రెండేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు.
నిందితుడి పేరు సతీష్ కుమార్. అతను 2013 అక్టోబర్ నెలలోనే ఆమె పైన తొలిసారి అనుచితంగా ప్రవర్తించాడు. అయితే, అతను తన కెరీర్‌ను చిక్కుల్లోకి నెడతారేమోననే అభిప్రాయంతో ఆమె అతని పైన అప్పుడే ఫిర్యాదు చేయలేదు.

కానీ ప్రొఫెసర్‌లో మార్పు లేదు. పలుమార్లు ఆమెను ముట్టుకోవడం, కౌగిలించుకోవాలని చూడటం చేశాడు. ల్యాబ్‌లో ఇలాంటివి చేసేవాడు. అంతేకాదు, ఓసారి పసుపు రంగు చీర కట్టుకొని రమ్మని బెదిరించాడు. లేదంటే యాసిడ్ పోస్తానని చెప్పాడు.
అంతేకాదు, బాధితురాలితో శృంగారం, వివాహేతర సంబంధాల గురించి మాట్లాడేవాడు. తాను చెప్పినట్లు నడుచుకోకుంటే గైడ్ చేయడం మానేస్తానని బెదిరించాడు. అతని వేధింపులు భరించలేక నిరుడు డిసెంబర్లో ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది. కానీ ఫలితం లేదు.
ప్రిన్సిపల్ తన ఫిర్యాదును పట్టించుకోకపోవడమే కాకుండా, తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాడని ఆమె ఆరోపించింది. వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications