రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- ఇకపై అది తప్పనిసరి
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి నేటి నుండి అమలులోకి వచ్చాయి. ఇకపై టికెట్ బుక్ చేసేటప్పుడు OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) తప్పనిసరి అవుతుంది. ఓటీపీ ధృవీకరణ తర్వాత మాత్రమే బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. పశ్చిమ రైల్వే ఈ నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన రైళ్లల్లో ప్రవేశపెట్టింది. క్రమంగా దేశంలోని అన్ని రైల్వే జోన్లకు ఈ విధానాన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
తత్కాల్ టికెట్ల బుకింగ్ లో చోటు చేసుకుంటోన్న దుర్వినియోగాన్ని అరికట్టడం, ప్రయాణం చేయాలనుకునే వారికి మాత్రమే అందుబాటులో ఉండేలా చూడటమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం. అప్పటికప్పుడు ప్రయాణించాలనుకునే వారికి టిక్కెట్లు లభించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన రైల్వే బోర్డు.. ఈ ఓటీపీ ఆధారిత బుకింగ్ విధానానికి ఆమోదం తెలిపింది.

మొదటిగా ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఈ తత్కాల్ టికెట్ బుకింగ్ ఓటీపీ వ్యవస్థ ప్రారంభమైంది. బుకింగ్ సమయంలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసిన తర్వాతే టికెట్ జారీ అవుతుంది. దీనివల్ల నకిలీ లేదా తప్పుడు మొబైల్ నంబర్లను ఉపయోగించి టిక్కెట్లు బుక్ చేయడం అసాధ్యమవుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కలిగిన ప్రయాణికులు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోగలరు.
ఈ విధానం అక్రమ టికెట్ బుకింగ్‌లను అరికట్టి, సరైన ప్రయాణికులకు తత్కాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చేలా దోహదపడుతుంది. దీని ద్వారా ప్రయాణికులు తమ ప్రయాణ అవసరాలను మరింత సులభంగా, పారదర్శకంగా పొందగలరు. డిసెంబర్ 15 నుంచి మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ఫోన్ స్క్రీన్‌పై కాల్ చేసేవారి అసలు పేరు కనిపించే సదుపాయం ప్రారంభం కావొచ్చు. టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ సదుపాయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.
తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బుకింగ్‌కు ముందు మొబైల్ నంబర్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవాలి. IRCTC వెబ్‌సైట్‌లో ఆ నంబర్ యాక్టివ్‌గా ఉందని నిర్ధారించుకోవాలి. టిక్కెట్ బుకింగ్ సమయంలో వేరే వ్యక్తి నంబర్ ను అందులో పొందుపర్చకూడదు. ఓటీపీ పంపిన తర్వాత మొబైల్ నంబర్‌ను మార్చడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. దీనివల్ల టికెట్లు పొందడంలో జాప్యం చోటు చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications