రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు, ఎక్కడ దాక్కొన్నారంటే ?, తెలంగాణ పోలీసులు ఎంట్రీ !

బెంగళూరులోని కుందలహళ్లిలోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. రామేశ్వరం కేఫ్‌లో బాంబు అమర్చిన ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని తెలిసింది.మార్చి 1వ తేదీన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబు పేలుళ్ల కుట్రలో కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఐసీస్ మాడ్యూల్ నిందితులు అబ్దుల్ మతీన్ తాహా, ముసావీర్ షాజీబ్‌లను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని తెలిసింది.

ఈ మేరకు ఎన్ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది, ఉగ్రవాదులు అసోం, పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకున్నారని సమాచారం తెలిసిందని, తరువాత నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

NIA officials arrested two in Bengaluru Rameswaram Cafe blast case
దళపతుల దిమ్మతిరిగింది, అందుకే ట్రబుల్ షూటర్ అయ్యాడు, రాత్రికిరాత్రే పక్కాప్లాన్ తో

శుక్రవారం ఉదయం బాంబు పేలుడుకు పాల్పడిన వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని తెలిసింది. పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో ఉగ్రవాది అబ్దుల్ మతీన్ తాహా, ముసావిర్ హుస్సేన్ షాజీబ్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ముసావిర్ హుస్సేన్ షాజీబ్ రామేశ్వరం కేఫ్‌లో ఐఈడీని అమర్చి దానిని పేల్చాడని, మరో నిందితుడు అబ్దుల్ మతీన్ తాహా రామేశ్వరం కేఫ్ లో బాంబు పెట్టాలని ప్లాన్ చేశాడని అధికారులు అంటున్నారు.

ఈ కేసులో మతీన్ ప్రధాన సూత్రధారిగా పనిచేశాడని అధికారులు అంటున్నారు. బాంబ్ ప్లాన్, ఎగ్జిక్యూషన్, బ్లాస్ట్ ప్లాన్ అన్నీ ప్లాన్ చేశాడు.రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు తరువాత నిందితులు కోల్ కత్తా పారిపోయి అక్కడ నకిలీ పత్రాలు ఇచ్చి, పేర్లు మార్చుకుని కోల్‌కతాలో అద్దె ఇల్లు తీసుకుని అక్కడే మకాం వేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ ఆపరేషన్‌లో ఐబీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక, కేరళ పోలీసులు ఎన్‌ఐఏకు సహకరించారు.

NIA officials arrested two in Bengaluru Rameswaram Cafe blast case
అన్ని ఏజెన్సీల సాయంతో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు నిందితులను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితులు వారి పేర్లను మార్చుకుని కోల్‌కతా శివార్లలోని తూర్పు మిడ్నాపూర్ దిఘలో నివాసం ఉంటున్నారని వెలుగు చూసింది. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఎన్‌ఐఏ ఉగ్రవాదుల ఇంటిపై దాడి చేసి నిద్రిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది.

ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.ఉగ్రవాదులను స్థానిక కోర్టులో హాజరుపరిచిన ఎన్‌ఐఏ బృందం ఆ తర్వాత బెంగళూరుకు తీసుకురానుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు దేవనహళ్లి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉగ్రవాదులను ఎన్ఐఏ తీసుకురానుంది. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఇంకా ఎవరిప్రమేయం అయినా ఉందా అని అధికారులు పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+