దళపతుల దిమ్మతిరిగింది, అందుకే ట్రబుల్ షూటర్ అయ్యాడు, రాత్రికిరాత్రే పక్కాప్లాన్ తో !

లోక్‌సభ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీల రాజకీయ నాయకులు తమ అభ్యర్థుల కోసం జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బెంగళూరు శివార్లలోని కనకపుర బండే లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రాత్రికి రాత్రే దళపతులలతో పాటు ప్రత్యర్థి పార్టీ రాజకీయ నాయకులకు పెద్ద షాక్ ఇచ్చారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని చూసి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యండలో కీలకపాత్ర పోషించిన డీకే శివకుమార్ లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ, జేడీఎస్ కు ఓటమి చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ను ఓడించడానికి ఇప్పటికే బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నో వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో డీకే శివకుమార్ కొట్టిన దెబ్బకు జేడీఎస్ నాయకుల మైండ్ బ్లాక్ అయ్యింది.

400 senior leaders of the JDS party joined the Congress party in the presence of DK Shivakumar

రామనగర జిల్లాలోని చెన్నపట్టణకు చెందిన అక్కురొడ్డి శివన్నతో పాటు సుమారు 400 మందికి పైగా జేడీఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న డీకే శివకుమార్ మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామికి పెద్ద షాక్ ఇచ్చారు. గురువారం రాత్రి చెన్నపట్టణకు చెందిన జేడీఎస్ నేత శివన్నతో పాటు వందలాది మంది జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

జేడీఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరిన తరువాత మాట్లాడిన డీకే శివకుమార్ జేడీఎస్ పార్టీ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి తమ కుటుంబ సభ్యులను బీజేపీ నుంచి పోటీ చేయించారని, అలాంటి పెద్దలు జేడీఎస్ పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారని ఎగతాళి చేశారు. దేవేగౌడ కొంతకాలం క్రితం కుమారస్వామికి పార్టీ అధికారాన్ని అప్పగించడం వల్లే ఆ పార్టీకి ఈ స్థితికి వచ్చిందని డీకే శివకుమార్ ఆరోపించారు.

గతంలో తమను అధికారం నుంచి దించిన బీజేపీని ఇప్పుడు ఒక్కలిగ మఠానికి వెళ్లారని డీకే శివకుమార్ ఆరోపించారు. కుమారస్వామి అధికారంలో ఉన్నప్పుడు జేడీఎస్ పార్టీ కార్యకర్తలకు తక్కువ అధికారం ఇచ్చారా?, అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమీ లేదు. కార్యకర్తలు లేకుండా ఏ పార్టీ ఉంటుంది?, అందుకే జేడీఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరడానికి పోటీ పడుతున్ననారని, వారిని మేము అన్ని విదాలుగా ఆదుకుంటామని డీకే శివకుమార్ చెప్పారు. మొత్తం మీద కుమారస్వామి ఎమ్మెల్యేగా ఉన్న చెన్నపట్టణకు చెందిన జేడీఎస్ నాయకులే వందల మంది కాంగ్రెస్ లో చేరిపోవడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+