పహల్గామ్ ఉగ్రదాడికి కారణం అదే- NIA చేతికి ఆధారాలు
Pahalgam Terror Attack: ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.
ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

ఈ క్రమంలో మరో అడుగు ముందుకు పడింది. పహల్గామ్ ఉగ్రవాదుల దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) టేకోవర్ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తు మొదలు పెట్టింది. పహల్గామ్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన బైసారన్ మీడోస్‌ను సందర్శించారు. అణువణువూ పరిశీలించారు.
ఇన్‌స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారులతో కూడిన ప్రత్యేక టీమ్ బైసారన్‌ను సందర్శించింది. యాంటీ- టెర్రర్ ఏజెన్సీ నుంచ పోలీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులు ఇందులో ఉన్నారు. ఫోరెన్సిక్ నిపుణలు ఈ దర్యాప్తులో భాగస్వామ్యం అయ్యాయి. పహల్గామ్, బైసారన్‌లో క్షేత్రస్థాయిలో భద్రత వ్యవస్థను పరిశీలించారు.
బైసారన్ మీడోస్ ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు ఎన్ఐఏ దర్యాప్తులో కీలకంగా మారాయి. పట్టపగలు, బహిరంగంగా ఏకే 47 వంటి మారణాయుధాలతో అంతమంది ఉగ్రవాదులు ఎలా పహల్గామ్‌లో అడుగుపెట్టగలిగారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా బైసారన్ మీడోస్‌లో ప్రవేశించగలిగారు అనే అంశంపై కూపీ లాగుతున్నారు. ప్రత్యక్ష సాక్షులను విచారించారు. ఉగ్రవాదుల రాకపోకల గురించి ఆరా తీశారు.
కొందరు ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించారు. పహల్గామ్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోజువారీ కార్యకలాపాలపై ఆరా తీశారు. కాల్పులు జరిగినప్పుడు బైసారాన్ మీడోస్‌లో ఎంతమంది పర్యాటకులు ఉన్నారు?, ఏకే 47తో ఉగ్రవాదులు ఆ ప్రదేశానికి ఎలా రాగలిగారు?, భద్రత లోపాలు ఏవైనా ఉన్నాయా వంటి అంశాలు సమీక్షించారు.












Click it and Unblock the Notifications