Pahalgam Chargesheet: పహల్గాం ఛార్జిషీట్ రెడీ..! ఎన్ఐఏ తేల్చిందిందే..!
పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్ధ లష్కరే తోయిబా పహల్గాం దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది. ఎన్ఐఏ సిద్ధం చేసిన ఛార్జిషీట్ ప్రకారం .. అనంతరం నిర్వహించిన 'ఆపరేషన్ మహాదేవ్'లో హతమైన ముగ్గురు లష్కర్-ఏ-తొయిబా ఉగ్రవ
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్ద (ఎన్ఐఏ) దర్యాప్తు పూర్తయింది. దీంతో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పహల్గాంలో ఏకపక్షంగా కాల్పులు జరిపి 26 మంది స్ధానికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకుల్ని ఉగ్రమూక పొట్టనపెట్టుకుంది. దీనిపై ఆరునెలలకు పైగా దర్యాప్తు జరిపిన ఎన్ఏఐ కీలక సాక్ష్యాల్ని సేకరించింది. అయితే ఇందులో పలు సంచలనాలు ఉన్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్ధ లష్కరే తోయిబా పహల్గాం దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది. ఎన్ఐఏ సిద్ధం చేసిన ఛార్జిషీట్ ప్రకారం .. అనంతరం నిర్వహించిన 'ఆపరేషన్ మహాదేవ్'లో హతమైన ముగ్గురు లష్కర్-ఏ-తొయిబా ఉగ్రవాదుల పేర్లను అధికారికంగా నిర్ధారించారు. దర్యాప్తు అధికారులు పహల్గామ్ దాడి ఒకే ఘటన కాదని, కశ్మీర్‌లో లష్కర్ విస్తృత, సమన్వయ ఉగ్ర వ్యూహంలో భాగమని బలంగా నిరూపించబోతున్నారు.

ఆపరేషన్ మహదేవ్ లో హతమైన ఉగ్రవాదులలో ఇద్దరికి గుజ్జర్-బక్కర్‌వాల్ వర్గం కుటుంబాలకు చెందిన స్థానిక వ్యక్తుల నుండి క్రియాశీలక సాయం లబించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ ఆరోపణలు కొందరు వ్యక్తులపై మాత్రమేనని, మొత్తం వర్గానికి సంబంధించినవి కావని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. ఈ స్థానికలు ఉగ్రవాదులకు తాత్కాలిక ఆశ్రయం, లాజిస్టికల్ మద్దతు, భద్రతా దళాలను తప్పించుకోవడానికి, అటవీ ప్రాంతాలలో సురక్షితంగా తిరగడానికి కీలక మార్గదర్శకాలను అందించినట్లు తేల్చారు.

అలాగే ఎన్ఐఏ ఛార్జిషీట్‌లో మూడో నిందితుడిని సజిద్ జట్‌గా పేర్కొన్నారు. ఇతను సరిహద్దుల అవతల హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు పనిచేసే చురుకైన లష్కర్-ఏ-తొయిబా ఆపరేటివ్‌గా గుర్తించారు. సజిద్ జట్ మాడ్యూల్‌ను సమన్వయం చేయడంలో, హ్యాండ్లర్‌లతో నిరంతరం కమ్యూనికేషన్, దాడి చేసేవారికి మద్దతు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఉగ్రవాద కుట్రలో స్థానిక సహాయ నెట్‌వర్క్‌లు కీలకంగా మారాయని ఛార్జిషీట్ చెబుతోంది. రహస్య స్థావరాలు, కదలిక మార్గాలు ఏర్పాటు చేయడంలో, దాడికి ముందు ఉగ్రవాదులకు అవసరమైన వనరులను సమకూర్చడంలో ఇవి సాయం చేశాయి. ఈ దాడి పహల్గాం ప్రాంతంలో అస్థిరత సృష్టించడానికి లష్కర్ చేసిన ప్రయత్నంలో భాగంగా తేల్చారు.












Click it and Unblock the Notifications