ఇంటి పై కప్పు కూలి 9 మంది సజీవ సమాధి
లక్నో: ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకునింది. ఇంటి పై కప్పు కుప్ప కూలిపోవడంతో ఒకే కుటుంబంలోని తొమ్మిది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉత్తరప్రదేశ్ లోని బాందా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి అందరూ భోజనం చేసి నిద్రపోయారు. అర్దరాత్రి ఒక్క సారిగా ఇంటి పై కప్పు కుప్పకూలిపోయింది. గాఢనిద్రలో ఉన్న తొమ్మిది మంది సంఘటనా స్థలంలో సజీవ సమాధి అయ్యారు.

తీవ్రగాయాలైన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఇల్లు చాలా సంవత్సరాల క్రితం నిర్మించారని, ఇంటి మరమత్తులు చెయ్యమని ఎన్ని సార్లు చెప్పినా ఇంటి యజమాని పట్టించుకోలేదని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గత కొన్ని రోజుల నుండి భారీ వర్షాలు రావడంతో ఇల్లు పూర్తిగా తడిసిపోయిందని, అందు వలనే ఇంటి పై కప్పు కూలి తొమ్మిది మంది మరణించారని పోలీసులు చెప్పారు. ఇంటి యజమాని పరారైనాడని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications