వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా బిడ్డ బతికి లేకపోవడం సంతోషం.. ఆ మ‌ృగాళ్లను చూసినప్పుడల్లా చస్తున్నా.. నిర్భయ తల్లి కంటతడి

|
Google Oneindia TeluguNews

నలుగురు హంతకులకు ఉరి శిక్ష విధించి తమకు న్యాయం చేయాలని నిర్భయ తల్లి ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను వేడుకొన్నారు. ఏడేళ్ల క్రితం తన కూతురు నిర్భయ అత్యాచారం, హత్యకు గురైన విషయాన్ని మరోసారి మీడియా ముందు ప్రస్తావించారు. 2012లో ఢిల్లీలో జరిగిన ఘటనలో తమకు ఇంకా న్యాయం జరుగలేదనే నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకొన్నారు.

ఎంత క్షోభ ఉంటుందో..

ఎంత క్షోభ ఉంటుందో..

మహిళ భద్రతపై జాతీయ మీడియా ఛానెల్ నిర్వహించిన చర్చలో ఆశాదేవి మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా నా బిడ్డకు జరిగిన అన్యాయం గురించి న్యాయ పోరాటం చేస్తున్నాను. 2012లో ఎలా ఉందో పరిస్థితి ఇప్పుడు కూడా అలానే ఉంది. న్యాయం కోసం ఏళ్లుగా ప్రాధేయపడుతున్నాను. ఈ పోరాటంలో నా జీవితమే ప్రశ్నార్థకమైంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురైన బాధిత కుటుంబాలు ఎంత క్షోభను అనుభవిస్తారో మాటల్లో చెప్పలేమన్నారు.

 నా కూతురు బతికి లేకపోవడం..

నా కూతురు బతికి లేకపోవడం..

నా కూతురు బతికి లేకపోవడం కొన్నిసార్లు చాలా సంతోషంగా ఉంటుంది. కోర్టులో దోషులను చూసినప్పుడుల్లా గుండె పగిలినంత బాధ కలుగుతుంది. నా బిడ్డ బతికి లేకపోవడం వల్ల అలాంటి మృగాలను చూసే దౌర్భగ్యం తప్పింది. అలాంటి వారిని చూసిన ప్రతీ రోజు నేను చచ్చిపోయినంత పని అవుతుంది అని ఆశాదేవి అన్నారు.

 మహిళలకు, పురుషులకు తేడా

మహిళలకు, పురుషులకు తేడా

ఆశాదేవి పోరాటానికి బాసటగా నిలుస్తానని, ఆమె ఆవేదనను అర్ధం చేసుకోగలనని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మిత దేవ్ అన్నారు. ఇది సామాజికపరమైన సమస్య. మహిళలు, పురుషుల అంతా సమానమేనని రాజ్యాగం చెబుతుంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే భూమ్యాకాశాలకు ఉన్నంత తేడా ఉంది అని సుస్మిత దేవ్ పేర్కొన్నారు.

ఘోరామైన నేరాలను అడ్డుకోవడానికి

ఘోరామైన నేరాలను అడ్డుకోవడానికి

మహిళ భద్రతపై జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ రీటా బహుగుణ, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ పాల్గొన్నారు. ఇలాంటి ఘోరమైన నేరాలను అడ్డుకోవాలంటే న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలని, అందుకోసం ప్రజలంతా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం రీటా బహుగుణ అన్నారు. మహిళల భద్రతపై ఐక్యంగా గళం వినిపించేందుకు సిద్ధం కావాలని, కఠిన మైన చట్టాలే రక్షణ కల్పిస్తాయి అని అనుప్రియ పటేల్ అన్నారు.

English summary
Nirbhaya Mother Asha Devi gets emotional at Women Safety Seminor. She sadi, she is happy her daughter is not alive. "When I see the convicts in the court, I am happy that my daughter didn't live to see them. I die every day when I see them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X