నిర్భయ కేసులో దోషిపై దాడి: భద్రతకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో ఓ దోషిపై తోటి ఖైదీలు దాడి చేశారు. ఈ ఘటన తీహార్ జైలులో గురువారం చోటుచేసుకుంది.
దోషి వినయ్ శర్మను భద్రత నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సమాచారం. ఈ దాడిలో వినయ్ శర్మ చేతికి గాయాలయ్యాయని తెలిసింది. నిర్భయ అత్యాచార ఘటనకు పాల్పడిన నలుగురు దోషులకు తీహార్ జైలులో పటిష్ట భద్రత కల్పిస్తున్నారు.

ఉరిశిక్ష తీర్పు రద్దు చేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్ విచారణ నేపథ్యంలో ఈ దాడి జరగబడం గమనార్హం.
2012లో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ ప్రైవేటు బస్సులో కాలేజీ విద్యార్థినిపై సామూహిక త్యాచారం చేయడంతోపాటు తీవ్రంగా గాయపర్చి ఆమె మరణానికి కారణమైన నలుగురు దోషులకు కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications