మరో నిర్భయ: మర్మాంగం వద్ద తుపాకీ పెట్టి గ్యాంగ్‌రేప్!
పాట్నా: బీహార్‌లో మరో నిర్భయ ఉదంతం వెలుగు చూసింది. 2012లో ఓ బస్సులో నిందితులు నిర్భయ పైన అత్యాచారానికి పాల్పడి, ఆమెను దారుణంగా హింసించిన విషయం తెలిసిందే. తాజాగా, అలాంటి సంఘటనే జరిగింది.
వస్తున్న వార్తల మేరకు... బీహార్లో 21 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు, ఆమె మర్మాంగాలను గాయపరిచారు. కర్రలు, తుపాకీ వంటి ఆయుధాలతో వారు గాయాలు చేశారు. నిందితులు తుపాకీని మర్మాంగం వద్ద పెట్టి భయపెట్టి దారుణానికి పాల్పడ్డారు.

గాయాలతో పడి ఉన్న ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నాడు. గతంలో ఓ స్థానిక వ్యక్తి ఆమెను వేధింపులకు గురి చేశాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications