Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లాలూ సపోర్ట్‌తో మళ్లీ సీఎంగా: నితీష్‌కి ఎదురుతిరిగిన సీఎం మాంఝీ

పాట్నా: జేడీయు నేత, బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత నితీష్ కుమార్‌కు షాకిచ్చారు. ఆయనకు ఎదురు తిరిగారు. సీఎం మాంఝీ ఇటీవలి వరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీని పైన అధిష్టానం కూడా ఆయనకు చురకలు అంటించింది. ఈ నేపథ్యంలో ఆయనను మార్చుతారనే ఊహాగానాలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి.

తాజాగా.. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయనకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మద్దతిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం మాంఝీ గద్దె దిగేందుకు ససేమీరా అంటున్నారు. అంతేకాదు, దమ్ముంటే తనను తొలగించాలని హెచ్చరికలు జారీ చేసినంత పని చేస్తున్నారని సమాచారం.

గత కొద్ది రోజులుగా నితీష్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఆయనకు లాలూ కూడా మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మాంఝీ ఎదురు తిరగడంతో జేడీయు రెండుగా చీలింది.

మరోవైపు, నితీష్ కుమార్‌కు మద్దతుగా పార్టీ అధ్యక్షులు శరద్ యాదవ్ శనివారం నాడు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ భేటీ పైన మాంఝీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శరద్ యాదవ్ సమావేశానికి పోకుండా.. ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకునే పనిలో మాంఝీ పడ్డారని సమాచారం. తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయనని మాంఝీ చెబుతున్నారు. దీంతో బీహార్ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.

Nitish Kumar Ready to Lead Bihar Again, Just One Problem: CM Manjhi dares JD(U)

మాంఝీ ఎలా అయ్యారంటే...

జేడీయూ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయేలో భాగస్వామి. ప్రధానమంత్రి పదవి కావాలనే ఆశతో అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించక ముందు.. ఎన్డీయేలో మోడీతో పాటు నితీష్ ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో జేడీయు ఎన్డీయే నుండి బయటకు వచ్చింది.

అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో మోడీ, బీజేపీ హావాను అడ్డుకునేందుకు నితీష్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ పార్టీలు పూర్తిగా చతికిలపడ్డాయి. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. పార్టీ పరాభవానికి బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ రాజీనామా చేశారు.

అయితే, ఆయన రాజీనామా పేరుతో రాజకీయం చేశారనే వాదనలు కూడా అప్పుడు వినిపించాయి. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మాంఝీని ఆ పీఠంపై కూర్చుండబెట్టారు. బీహార్‌లో రెండు దశాబ్దాలుగా ఆర్జేడీ, జేడీయులు విపక్షాలు. ఇప్పుడు మోడీని ఎదుర్కొనేందుకు లాలూ, నితీష్‌లు ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో నితీష్ ఇప్పుడు లాలూ మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+