హమ్మయ్యా.. రేపు బ్యాంకుల స్ట్రైక్ వాయిదా.. పనిచేయనున్న బ్యాంక్స్, మళ్లీ బంద్ ఎప్పుడు అంటే
వేతన సవరణ డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపు ఇచ్చిన ట్రేడ్ యూనియన్లు వెనక్కి తగ్గాయి. రేపు (23వ తేదీ బుధవారం) బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని తెలిపాయి. తమ స్ట్రైక్ వచ్చేనెలలో చేపడుతామని తెలిపాయి. మార్చి 28, 29 తేదీల్లో బంద్ ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు ట్రేడ్ యూనియన్లు ఒక ప్రకటనలో తెలిపాయి. కరోనా మహమ్మరి, 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తమ నిరసనను నెలరోజుల పాటు వాయిదా వేశాయి.వాస్తవానికి స్ట్రైక్ కోసం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సిబ్బంది అంతా రెడీ అయ్యారు. కానీ యూనియన్లు మాత్రం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు.
20 శాతం వేతనాల పెంపు, 5 రోజుల పనిదినాలు, ఎన్‌పీఎస్ తొలగింపు వంటి 11 డిమాండ్లు చేశాయి. బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచాలని 20 సార్లు చర్చలు జరిపామని, 13 శాతానికి మించి పెంచేందుకు అంగీకరించడం లేదని వెల్లడించింది. సమ్మెలో అన్ని యూనియన్లు ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్‌సీబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్‌ఐ, ఐఎన్‌బీఈఎఫ్, ఐఎన్‌బీఓసీ, ఎన్‌ఓబీడబ్ల్యూ, ఎన్‌ఓబీఓ బ్యాంకింగ్ సంఘాలు ఉద్యోగులు పాల్గొంటాయి.. కానీ ఇప్పుడు మాత్రం వాయిదా పడింది.

డిమాండ్లు పరిష్కరించపోతే మార్చి 11, 12, 13 తేదీల్లో కూడా సమ్మె ఉంటుందని యూఎఫ్‌బీయూ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కానీ అదీ కూడా ఇప్పుడు ఉండే అవకాశం లేదు. వాస్తవానికి మార్చి 10వ తేదీన 5 రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. దాంతో అంతా ఫ్రీ అవుతుంది. కానీ దానిపై కూడా ట్రేడ్ యూనియన్లు స్పష్టమైన సంకేతాలను ఇవ్వలేదు. మార్చి 28, 29 తేదీల్లో మాత్రం బంద్ ఉంటుందని తెలియజేసింది.












Click it and Unblock the Notifications