టి బిల్లులో తప్పులా: జైరాం ఆశ్చర్యం, స్వల్ప సవరణలు!
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ-2013 బిల్లుల్లో తప్పులు ఏవీ లేవని కేంద్రమంత్రి జైరాం రమేశ్ సోమవారం చెప్పారు. జైరామ్‌తో కొందరు పార్లమెంటు సభ్యులు తెలంగాణ ముసాయిదా బిల్లులో తప్పులు ఉన్నాయని ప్రస్తావించారు. దీనికి ఆయన ఆశ్చర్య పోయారట.
తమిళనాడు తర్వాత అక్షర క్రమంలో తెలంగాణ వస్తుందని అదే విషయం బిల్లులో చెప్పామని ఆయన వివరించారు. బిల్లు దాదాపు తానే రూపొందించినందు వల్ల అందులో ఉన్న అంశాలన్నీ తనకు గుర్తున్నాయని, తప్పులేవన్నా ఉంటే తనదే బాధ్యత అవుతుందని ఆయన చెప్పారు.

సవరణలు
మరోవైపు కేంద్ర కేబినెట్ ఆమోదించిన ముసాయిదా బిల్లు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన తర్వాత అక్కడ నిశిత పరిశీలన జరిగింది. ముసాయిదా బిల్లులోని లోపాలను గుర్తించిన రాష్ట్రపతి భవన్ న్యాయ విభాగం, న్యాయ శాఖ అందులోని లోపాలను గుర్తించింది. రాష్ట్ర విభజన తర్వాత జరగాల్సిన కొన్ని అంశాలను రాజ్యాంగంలో పొందుపర్చాల్సి ఉన్నప్పటికీ కేబినెట్ ముసాయిదాలో వాటిని పేర్కొనలేదు.
అక్షర క్రమంలో తమిళనాడు తర్వాత తెలంగాణ అని కూడా చేర్చాల్సి ఉన్నప్పటికీ, ముసాయిదా బిల్లులో దానిని మరిచిపోయారు. అలాగే, రాజ్యాంగంలోని నాలుగో షెడ్యూలులో రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అన్న వివరణ ఉంటుంది. ముసాయిదా బిల్లులో తెలంగాణ రాష్ట్రాన్ని ఆ జాబితాలో చేర్చినట్లు చూపలేదు. ఆ తర్వాత వీటిని సరిదిద్దారు. ఆర్టికల్ 168కు సవరణలు ప్రతిపాదించారు. అలాగే, రెండో షెడ్యూలులో పార్లమెంటు, శాసనసభ స్థానాల వివరాలను ప్రస్తావించినప్పుడు జూబ్లీహిల్ సహా ఐదు అసెంబ్లీ స్థానాల పేర్లు గల్లంతయ్యాయి. దీనిని కూడా రాష్ట్ర శాసన సభకు పంపించిన తుదిత జాబితాలో సవరించారు.












Click it and Unblock the Notifications