కేరళ స్కూళ్లలో సంచలన మార్పు..! సినిమా ప్రేరణతో మారిపోతున్న క్లాసు రూమ్స్..!

దేశంలోనే అక్షరాస్యత రేటులో టాప్ లో ఉండే కేరళ రాష్ట్రం ఇప్పుడు మరో గొప్ప మార్పుకు నాంది పలికింది. దశాబ్దాలుగా విద్యార్ధులతో పాటు జనం మనసుల్లో పాతుకుపోయిన ఓ భావజాలాన్ని సమూలంగా మార్చేస్తూ కొత్త చరిత్రను లిఖిస్తోంది. దీని వెనుక ఇటీవలే విడుదలైన ఓ తాజా మలయాళ చిత్రం ఉండటం ఇక్కడ మరో విశేషం. దీంతో ఇప్పుడు కేరళ స్కూళ్లలో ఎక్కడ చూసినా ఈ మార్పు కనిపిస్తోంది.

సాధారణంగా మనం క్లాస్ రూమ్ అనగానే మనసులో మెదిలేది ముందు టీచర్ టేబుల్, కుర్చీ కాగా.. ఆ తర్వాత దీనికి ఎదురుగా వరుసగా విద్యార్ధులు కూర్చొనే టేబుల్స్, కుర్చీలే. దీని వల్ల ముందు వరుసలో కూర్చొనే విద్యార్ధులకు టీచర్ చెప్పే పాఠాలు పూర్తిగా అర్థమయ్యే పరిస్ధితి ఉంటుంది. అలాగే క్లాస్ పై, పాఠం చెప్పే టీచర్ పై ఏకాగ్రత ఉంటుంది. కానీ చివరి బెంచీకి వచ్చే సరికి అది పూర్తిగా తగ్గిపోతోంది. దీనికి కారణం టీచర్ కు దూరంగా, కనిపించకుండా ఉండేసరికి ఏమీ కాదులే అన్న ఓ భావన. దీంతో సహజంగానే ఒకే క్లాసులో చదువుతున్న వారిలో చదువుపై ఆసక్తి లేని వారంతా ఇలా బ్యాక్ బెంచ్ కు చేరుతున్నారు.

no more backbenchers in kerala schools adopted new seating layout from a Malayalam movie

దీనికి కౌంటర్ గా క్లాస్ రూమ్ లో ఉండే టేబుల్స్ లో చిన్న మార్పు చేయడం ద్వారా అదే క్లాసులో ఉన్న అందరు విద్యార్ధుల్లోనూ ఒకే రకంగా చదువుపై ఆసక్తి, ఏకాగ్రత ఉంటుందని చెబుతూ మలయాళంలో తాజాగా బ్యాక్ బెంచర్స్ అనే సినిమా వచ్చింది.
ఇందులో క్లాస్ రూమ్ లో సహజంగా ఒక దాని వెనుక మరొకటి ఉంటే టేబుల్స్ , కుర్చీల స్ధానంలో వీ ఆకారంలో వాటిని అమర్చుతారు. దీని వల్ల ప్రతీ విద్యార్దీ టీచర్ ముందే ఉన్నట్లు కూర్చుంటారు. అలాగే ప్రతీ విద్యార్దీ టీచర్ కు పూర్తిగా కనిపించడంతో పాటు టీచర్ చెప్పేది కూడా వినిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందరికో స్పూర్తినిస్తోంది.

no more backbenchers in kerala schools adopted new seating layout from a Malayalam movie

ఈ బ్యాచ్ బెంచర్స్ సినిమా ఇచ్చిన ప్రేరళతో ఇప్పుడు కేరళలోని చాలా స్కూల్స్ దీన్నే ఫాలో కావాలని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీంతో క్రమంగా కేరళ స్కూళ్లలో వేగంగా మార్పు కనిపిస్తోంది. కేరళలోని పలు పాఠశాలల్లో ఇలా వీ ఆకారంలో టేబుల్స్ వేసి విద్యార్ధులను కూర్చుబెడుతున్నారు. దీంత వారు కూడా ఈ కొత్త సీటింగ్ లే అవుట్ పై ఆసక్తి చూపుతున్నారు. అందరికీ ప్రయోజనకరంగా ఉండే ఈ విధానం మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా వచ్చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+