మోడీని తట్టుకోవడం కష్టం, టి లేఖ వెనక్కొద్దు: వెంకయ్య
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని తట్టుకోవడం ఎవరివల్ల కాదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు శనివారం హైదరాబాదులో అన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీకి వంద సీట్లు కూడా రావని, కాంగ్రెసు పార్టీ దిక్కుతోచని పరిస్థితిలు ఉందన్నారు.
దేశవ్యాప్తంగా మోడీ హవా వీస్తోందన్నారు. త్వరలో దక్షిణాది రాష్ట్రాల పైన తాము దృష్టి సారిస్తామని చెప్పారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని, ఇప్పుడు ఆ లేఖలను ఎవరు వెనక్కి తీసుకోవద్దని కోరారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ నేతలు ఎందుకు జైత్రయాత్రలు చేస్తున్నారో చెప్పాలన్నారు.

తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ విభజన సమస్యను పరిష్కరించలేకపోయిందని ఇప్పుడు ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం డ్రామాలాడుతోందన్నారు. తమిళనాడులో మోడీ ప్రసంగానికి భారీగా ప్రజలు హాజరయ్యారని, రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల పైన మరింత దృష్టి పెడతామన్నారు.
దేశంలో ప్రతి ఓటరు మోడీ ప్రధాని కావాలనుకుంటున్నారని, ఏ ప్రాంతంలో చూసినా మోడీ పైనే చర్చ జరుగుతోందన్నారు. మోడీని వ్యతిరేకించే రాజకీయ నేత ఎవరూ లేరన్నారు.












Click it and Unblock the Notifications