వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ఎవరికి వచ్చిదంటే..

|
Google Oneindia TeluguNews

నోబెల్ శాంతి పురస్కారం 2022ను ప్రకటించారు. ఈసారి శాంతి పుర‌స్కారాన్ని ఓ వ్య‌క్తితో పాటు మ‌రో రెండు సంస్థ‌ల‌కు క‌లిపి ప్రకటించారు. నార్వేయ‌న్ నోబెల్ క‌మిటీ ఈ అవార్డును ప్ర‌క‌టించింది. బెలార‌స్‌కు చెందిన మాన‌వ హ‌క్కుల అడ్వ‌కేట్ అలెస్ బియాలియాస్కీతో పాటు ర‌ష్యాకు చెందిన మాన‌వ హ‌క్కుల సంస్థ‌ మెమోరియల్, ఉక్రెయిన్‌కు చెందిన సివిల్ లిబ‌ర్టీస్‌ మాన‌వ హ‌క్కుల సంస్థ‌ల‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కింది.

Nobel Peace Prize 2022 goes to Memorial, Center for Civil Liberties along with Ales Bialiasky

శాంతి కోసం
నోబెల్ శాంతి బ‌హుమ‌తి సాధించిన వారు స్వ‌దేశాల్లో సివిల్ సొసైటీ త‌ర‌పున పోరాటం చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ పేర్కొంది. యుద్ధ నేరాల‌ను డాక్యుమెంట్ చేయ‌డంలో వాళ్లు అసాధార‌ణ సామ‌ర్థ్యాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు వివరించింది. అధికార దుర్వినియోగాన్ని వాళ్లు నిరంత‌రం ప్ర‌శ్నించార‌ని తెలిపింది. పౌరుల ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ర‌క్షించిన‌ట్లు క‌మిటీ వెల్ల‌డించింది. మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌లు, అధికార దుర్వినియోగాన్ని వాళ్లు వేలెత్తి చూపిన‌ట్లు వెల్లడించింది. శాంతి, ప్ర‌జాస్వామ్యం కోసం శాంతి పుర‌స్కార గ్ర‌హీత‌లు ఎంతో కృషి చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది.

English summary
Human rights advocate Ales Bialiatski from Belarus, the Russian human rights organisation Memorial and the Ukrainian human rights organisation Center for Civil Liberties have won this year's Nobel Peace Prize.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X