వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విన్ ట‌వ‌ర్ల కూల్చివేత‌కు రంగం సిద్ధం

|
Google Oneindia TeluguNews

నోయిడాలో వివాదాస్పదంగా మారిన జంట టవర్లను ఆగస్టు 21వ తేదీన కూల్చివేయ‌బోతున్నారు. ఇందులో 32 ఫ్లోర్ల‌తో అపెక్స్, 31 ఫ్లోర్ల‌తో సెయానే ఉన్నాయి. టన్న‌లుకొద్దీ పేలుడు ప‌దార్థాలు ఉప‌యోగించి 100 మీట‌ర్ల ఎత్త‌యిన ఈ ట‌వ‌ర్ల‌ను నేల‌మ‌ట్టం చేయ‌బోతున్నారు. ఆగస్ట్ 2వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఈ జంట టవర్లను పూర్తిగా పేలుడు పదార్థాలతో నింపుతారు. 21వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు క్షణాల్లో వీటిని కూల్చివేయనున్నారు. కూల్చివేత స‌మ‌యంలో నోయిడా-గ్రేట‌ర్ నోయిడా ఎక్స్ ప్రెస్ ర‌హ‌దారిపై వాహ‌నాల‌ను కూడా నిలిపివేయ‌నున్నారు.

నిబంధనలు ఉల్లంఘించి వీటి నిర్మాణాలు జరిగాయని గ‌తేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేసి మోసపోయిన వారికి ఆ న‌గ‌దును కూడా వెన‌క్కివ్వాల్సి ఉంది. 1,396 ఫ్లాట్లలో దాదాపు 5 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించబోతున్నారు. ఆగస్టు 14న కూల్చివేతకు సంబంధించిన పూర్తిస్థాయి రిహార్సల్ నిర్వహించబోతున్నారు.

noida twin towers demolition next month august 21st

ఈ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్ర‌క‌టించారు. అలాగే నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కూడా కోర‌బోతున్నారు. పేలుడుకు మూడు గంటల ముందు, రెండు గంటల తర్వాత ఆంక్షలు అమల్లో ఉండ‌బోతున్నాయి. ఈ ట‌వ‌ర్ల‌కు ఆనుకొని ఉండే ఇత‌ర నివాస స‌ముదాయాల‌పై ఈ పేలుడు తీవ్ర ప్ర‌భావాని చూప‌బోతోంద‌ని నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. స‌మీప ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల్లో దీనిపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

English summary
The controversial twin towers in Noida are slated to be demolished on August 21
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X