కొత్త పార్టీ పెట్టడం లేదు.. ఇప్పుడు కాదు.. గులాం నబీ ఆజాద్

ఇటీవల జమ్మూకశ్మీర్‌లో గులాం నబీ ఆజాద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో ఆయన పార్టీ పెడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సభలు, సమావేశాలు నిర్వహిస్తుండటం, సన్నిహితులు 20 మంది కాంగ్రెస్ పదవులకు ఇటీవల రాజీనామా చేశారు. దీంతో స్వతహాగానే సొంత పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఆ ఊహాగానాలపై స్వయంగా స్పందించిన ఆజాద్.. సోనియా,రాహుల్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే కొత్త పార్టీ ప్రకటనపై కీలక వ్యాఖ్యలు చేశారు.

జమ్మూకశ్మీర్ రాంబాన్ సిటీలో ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్నారు. తనకు కొత్త పార్టీ ఏర్పాటు చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో చాలా కాలంగా నిలిచిపోయిన రాజకీయ కార్యకలాపాలను పునరుద్ధరించడం కోసమే తాను సమావేశాలు, సభలను నిర్వహిస్తున్నానని ఆజాద్ తెలిపారు. పార్టీ పెట్టాలనే ఆలోచన ఎప్పటికీ లేదా? ప్రస్తుతానికేనా? అనే ప్రశ్నకు.. ఎప్పుడు చనిపోతామన్నది మనకు తెలియనట్లుగానే.. రాజకీయాల్లో తర్వాత ఏం జరుగుతుందనేది ఎవ్వరూ చెప్పలేరు అని బదులిచ్చారు.

Not Launching Party But...: Congress Rebel Ghulam Nabi Azad

రాజకీయాలను వదిలేద్దామనుకున్నానని,అయితే లక్షలాది మంది తన మద్దతుదారుల కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్‌పై విమర్శలు గుప్పించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీలో విమర్శకు స్థానం ఉండేదని, కానీ ప్రస్తుత కాంగ్రెస్‌లో విమర్శకు అసలు చోటు ఉండటం లేదన్నారు. పరిస్థితులు తప్పు దారి పట్టినప్పుడు, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇందిరా, రాజీవ్ గాంధీ మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చేవారు. విమర్శ చేయడాన్ని ఆ ఇద్దరూ ఏనాడూ తప్పుగా చూడలేదు. కానీ ప్రస్తుత నాయకత్వం మాత్రం విమర్శను తప్పుగానే చూస్తుందన్నారు.

రాజీవ్ గాంధీ రాజకీయాల్లో చేరిన సమయంలో ఇందిరాగాంధీ తమ ఇద్దర్ని పిలిచి రాజీవ్ గాంధీకి నన్ను ఇలా పరిచయం చేశారు. గులాం నబీ నా మాటను చాలా సార్లు కాదనగలరు. అలా అసమ్మతి స్వరంతో మాట్లాడటమంటే పార్టీకి అవిధేయంగా లేదా అగౌరవంతో ఉన్నట్లు కాదు. కచ్చితంగా పార్టీ మేలు కోసమే అని ఇందిరా.. రాజీవ్తో అన్నారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి వేరు. ఇలా కాదు అని మాట్లాడితే పార్టీలోనే అపరిచితులమైపోతున్నాం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+