వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక ‘ఆధార్’ ఉంటేనే.. విమాన టికెట్ బుకింగ్, ప్రయాణం

ఇక మీదట విమానాశ్రయంలోకి ప్రవేశించాలన్నా.. విమానం ఎక్కాలన్నా ‘ఆధార్’.. కీలకం కానుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు విమానాశ్రయంలో ప్రవేశించడానికి ఏదైనా ఐడీ కార్డు ఉంటే సరిపోతుంది. కానీ ఇక మీదట ఇలా కాదు, మీరు విమానాశ్రయంలోకి ప్రవేశించాలన్నా.. విమానం ఎక్కాలన్నా 'ఆధార్' కీలకం కానుంది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా దేశీయ విమాన ప్రయాణాలకు 'ఆధార్'ను తప్పనిసరి చేసేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఈ బాధ్యతను ఐటీ దిగ్గజం 'విప్రో'కు అప్పగించింది.

Now, Aadhaar for getting on a plane?

టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో తప్పనిసరిగా ఆధార్ నంబర్ ను నమోదు చేసేలా నిబంధనలు తీసుకురానున్నారు. దీనికోసం ఆయా విమానాశ్రయాల్లో బయోమెట్రిక్ యాక్సెస్ ను కూడా అందుబాటులోనికి తీసుకురానున్నారు.

విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద ఉండే టచ్ ప్యాడ్ పై ప్రయాణికుడు తన బొటనవేలిని ఉంచితే చాలు.. ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం మొత్తం సెక్యూరిటీకి చేరిపోతుంది. ఇటీవల విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా, కార్యదర్శి ఆర్.ఎన్.చౌబేలు ఎయిర్ పోర్టు ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

విదేశీ ప్రయాణాలకు మాత్రం పోస్ పోర్టు తప్పనిసరి. ఒక్క దేశీయ ప్రయాణాలకు మాత్రమే ఆధార్ ను అనుసంధానం చేయనున్నారు. ఈ కొత్త విధానం ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గురు ప్రసాద్ మహాపాత్ర తెలిపారు.

English summary
NEW DELHI: The government has asked IT major Wipro to develop a blueprint for Aadhaar-based biometric access to flyers at all airports across India. Wipro is expected to give the report by early May and then airports will begin the process of a passenger's thumb being all the identification he or she requires to fly for domestic flights as international ones will need passports. The aviation ministry had been toying with the idea of linking Aadhar numbers to air travel bookings and then enabling biometric access possible at airports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X