గోమాంసంతో విందు: కాశ్మీర్ ఎమ్మెల్యేపై సిరా దాడి
న్యూఢిల్లీ: గోమాంసంతో డిన్నర్ ఇచ్చానని ప్రకటించిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ్యుడదు ఇంజనీర్ రషీద్‌పై సిరాతో దాడి జరిగింది. ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించేందుకు వచ్చిన రషీద్‌పై ఇద్దరు యువకులు సోమవారంనాడు ఈ దాడి జరిపారు.
గోవు తమకు మాత వంటిదని తమ సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకే ఇంకుతో దాడి చేశామని వారు చెప్పారు. విష్ణు గుప్తా నాయకత్వంలోని హిందూ సేనకు చెందినవారు తామే దాడి చేశామని చెప్పుకున్నారు.

పోలీసులు వచ్చి యువకులను అదుపులోకి తీసుకున్నారు. తనపై ఇంకు దాడి జరిగినంత మాత్రాన తాను వెనుకడుగు వేసేదిలేదని రషీద్ అన్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గోవు మాంసంతో డిన్నర్ ఇచ్చానని చెప్పినందుకు బిజెపి ఎమ్మెల్యే రషీద్‌పై అసెంబ్లీలోనే దాడి చేసి చెంప పగలకొట్టారు.
బిజెపి శాసనసభ్యుల నుంచి రషీద్‌ను రక్షించేందుకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెసు శాసనసభ్యులు ఆ సమయంలో ప్రయత్నించారు. నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని జమ్మూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వివాదం ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications