• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇక నుండి అమ్మ లేకుండా తమిళనాడు రాజకీయాలు ,పార్టీలో ఆమె అంతటి సమర్థులున్నారా

By Narsimha
|

చెన్నై:జయలలిత మరణంతో పార్టీని సమర్థవంతంగా నడిపే శక్తి సామర్థ్యాలు ఎవరికీ ఉన్నాయి, ప్రత్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తే ధీటుగా ఎదుర్కొనే శక్తి అన్నా డిఎంకెలో ఎవరికీ ఉన్నాయనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఎంజిఆర్ మరణం తర్వాత చోటుచేసుకొన్నట్టుగా .పార్టీలో పరిణమాలు జరిగితే వాటిని నిలువరించే సత్తా ఉన్న వారు పార్టీలో ఉన్నారా...ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలను చిత్తుచేస్తారా ..ప్రస్తుతం ఇవే ప్రశ్నలు జయ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

తన పాలనతో , సంక్షేమ పథకాలతో వరుసగా రెండో దఫా తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకొన్నారు జయలలిత. అయితే ఆమె మరణంతో ముఖ్యమంత్రి భాద్యతలను పన్నీర్ సెల్వం తీసుకొన్నారు. జయకు పన్నీర్ సెల్వం అత్యంత విశ్వాసపాత్రుడు. ఆమె తరహాలో ప్రభుత్వాన్ని నడిపించే సత్తా సెల్వం కు ఉందా అనే చర్చ కూడ లేకపోలేదు.

తమిళనాడు అసెంబ్లీలో 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. అియతే ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నాడిఎంకె 134 మంది ఎంఏల్ఏలు ఉన్నారు. జయ మరణంతో ఈ సంఖ్య 133కు పడిపోయింది. కాంగ్రెస్ , డిఎంకె కూటమి బలం 98 .తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే కనీస మెజారిటీ 118 మంది సభ్యులు.

 now onwards without jayalalita in tamilnadu politics

అధికారానికి మరో 20 మంది ఎంఏల్ఏ దూరంలో డిఎంకె పార్టీ ఉంది. అయితే అన్నా డిఎంకె పార్టీని అన్నీ తానై నడిపిన జయలలిత మరణించారు. భయమో, భక్తితో పార్టీలో అణిగిమణిగి ఉన్నవారికి జయ లేకపోవడం కొంత స్వేచ్చను ఇస్తోంది. అయితే అలాంటి వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే, ప్రత్యర్థులతో చేతులు కలిపే పరిస్తితులే వస్తే, అలాంటి పరిస్థితులను పార్టీ ఏ రకంగా చక్కబెడుతోంది. ఈ రకమైన వ్యవహారాలను ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తారనేది ప్రస్తుతం వేధిస్తోన్న ప్రశ్న.

ఎం జి ఆర్ మరణం తర్వాత కూడ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఓ గ్రూపుకు జానకీ రామచంద్రన్ నేతృత్వం వహించారు. మరో గ్రూపుకు జయలలిత నాయకత్వం వహించారు. కాలక్రమేణా రెండు గ్రూపులు కలిసిపోయాయి. జయ నేతృత్వంలోనే జానకీ రామచంద్రన్ నేతృత్వంలోని గ్రూపు కలిసింది. పార్టీలోని సీనియర్లను కూడ ఆమె తన అదుపులో పెట్టుకోగలిగింది.

ఎంజిఆర్ మరణంతో ఆయన సతీమణి కొంత కాలం ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించారు. అయితే అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆమె ప్రభుత్వాన్ని భర్తరప్ చేశారు. దక్షిణాదిలో బిజెపి బలహీనంగా ఉంది.ఆ పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే జయ లేని పరిస్థితులను ఆసరాగా చేసుకొని కేంద్రం వ్యవహరించే తీరుపై కూడ సర్వత్రా ఆసక్తి నెలకొంది.

English summary
who is the strong leader in aiadmk after jaya,.if any crises in political issue, who can handle these type of questions raised , after mgr deaths some crises in party, jaya is capther the party. dmk,between aiadmk mlas differances 20 mlas, who will handle the any problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X