రాజు క్షమాభిక్ష.. 57 మంది మృతి! ఒక్క రాత్రిలో మారిన దేశ తలరాత

అటూ ఇటూ నీళ్లతో ముడిపడిన ఓ చిన్న నేలముక్క.. ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందో తెలియని ఉత్కంఠ వాతావరణం. స్పెయిన్ ఆధీనంలో ఉంటూ ఆఫ్రికా తీరానికి ఆనుకుని ఉండే 'సీవుటా' నగరం ఇప్పుడు సరిగ్గా అలాంటి అభద్రతా భావాన్నే అనుభవిస్తోంది. సముద్రం ఒడ్డున ఐరోపా యూనియన్ ను ఆఫ్రికా ఖండంతో ఉన్న ఏకైక భూ సరిహద్దు కావడంతో, మెరుగైన భవిష్యత్తు కోసం కనుపాపల్లో ఆశలతో బయలుదేరే వేలాది మందికి ఇది తొలి గమ్యస్థానంగా మారుతోంది. అయితే, కొన్ని గంటల వ్యవధిలోనే ఊహించని రీతిలో వేలాది మంది ఒకేసారి సరిహద్దులను బట్రాసు దాటుకుంటూ రావడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. స్థానిక వ్యవస్థలన్నీ ఒక్కసారిగా స్థంభించిపోవడంతో సీవుటా ప్రస్తుతం ఎమర్జన్సీ పరిస్థితులను ఎదుర్కొంటోంది.

సోషల్ మీడియా పుకారే ప్రధాన కారణమా?

సరిహద్దుల్లో ఉన్నట్టుండి ఇంతపెద్ద ఎత్తున మానవ ప్రవాహం ప్రత్యక్షం కావడం వెనుక మానవ అక్రమ రవాణా ముఠాల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దులు తెరుచుకున్నాయని, భద్రత సడలించారంటూ సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌ల ద్వారా ప్రచారమైన తప్పుడు వార్తలే ఈ అల్లకల్లోలానికి మూలమని తెలుస్తోంది. మొరాకో కొత్త రాజు ప్రమాణ స్వీకారం సందర్భంగా "వేలాది మంది ఖైదీలకు రాజు క్షమాభిక్షలు ప్రసాదించారు. వెంటనే దేశం విడిచి వెళ్లాలనే" ఫార్వర్డ్ మెసేజ్ ఈ వలసల వరదకు కారణమైంది.

Why the Latest Ceuta Migrant Surge is Worse Than 2021 Spain Deploys Troops at EU Gateway Border

పేదరికం, నిరుద్యోగంతో అల్లాడుతున్న వేలాది మంది యువకులు, కుటుంబాలు నిజానిజాలు తెలుసుకోకుండానే 'ఇదే మంచి సమయం' అనుకుని ఒక్కసారిగా సరిహద్దుల వైపు పరుగులు తీశారు. కొందరు ఎత్తైన కంచెలను దాటేందుకు ప్రయత్నించగా, మరికొందరు ప్రాణాలకు తెగించి సముద్ర మార్గంలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. కేవలం రెండు మూడు రోజుల్లోనే దాదాపు 60 వేల మంది వరకు ఈ చిన్న ఎన్‌క్లేవ్‌లోకి ప్రవేశించడంతో స్థానిక యంత్రాంగం చేతులెత్తేసింది. ఈ ప్రమాదకర ప్రయాణంలో 57 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. గతంలో 2021లోనూ ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగి సుమారు 10,000 మంది చొరబడ్డారు. కానీ ఈసారి ఆ సంఖ్య ఐదు రెట్లకు పైగా ఉండటం గమనార్హం.

150 ఏళ్ల తర్వాత సింహాసనంపై యువరాణి.. 20 ఏళ్లకే దేశాన్ని ఏలే రాజకుమారి
150 ఏళ్ల తర్వాత సింహాసనంపై యువరాణి.. 20 ఏళ్లకే దేశాన్ని ఏలే రాజకుమారి

మూతపడిన దుకాణాలు.. రద్దయిన వేడుకలు

ఈ అకస్మాత్తు పరిణామంతో సీవుటా నగరంలో సాధారణ జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. భద్రతా కారణ దృష్ట్యా వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. కేవలం మెడికల్ షాపులు మాత్రమే పనిచేస్తున్నాయి. నిత్యావసర సరుకులు, పాలు, రొట్టెలు కూడా దొరకని పరిస్థితి నెలకొనడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నగర ప్రభుత్వం నిర్వహించాల్సిన వార్షిక ఉత్సవాలను సైతం రద్దు చేసింది. రోడ్లపై ఎటు చూసినా గందరగోళం, అలజడి రాజ్యమేలుతున్నాయి.

రంగంలోకి సైన్యం.. స్పెయిన్, మొరాకోల సంయుక్త చర్యలు

భద్రతను పునరుద్ధరించేందుకు స్పెయిన్ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. స్థానిక పోలీసులకు అదనంగా సరిహద్దుల్లో బలగాలను, సైనిక దళాలను మోహరించింది. స్పెయిన్ ప్రధాని స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు మొరాకో అధికారులు కూడా సరిహద్దు సమీపంలో నిఘాను తీవ్రతరం చేశారు. సరిహద్దు ఒప్పందాల ప్రకారం అర్హత లేని వారిని తిరిగి మొరాకోకు పంపించే ప్రక్రియను వేగవంతం చేశారు.

118 ఏళ్ల నాటి సరిహద్దు గోడలు బద్దలు.. ఇకపై నో పాస్‌పోర్ట్, నో వీసా!
118 ఏళ్ల నాటి సరిహద్దు గోడలు బద్దలు.. ఇకపై నో పాస్‌పోర్ట్, నో వీసా!

అంతర్జాతీయ స్థాయికి చేరిన దౌత్యపరమైన వేడి

ఈ వ్యవహారం కేవలం స్పెయిన్, మొరాకోలకే పరిమితం కాకుండా మొత్తం ఐరోపా సమాఖ్యను ఉలిక్కిపడేలా చేసింది. సరిహద్దుల భద్రతపై ఐరోపా దేశాల్లో మళ్లీ చర్చ మొదలైంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఫ్రెంచ్, ఇటలీ వంటి పొరుగు దేశాలు కూడా నిఘాను పెంచాయి. తాత్కాలిక పునరావాస కేంద్రాల ఏర్పాటు, బాధితులకు వైద్యం, ఆహారం అందించడం వంటి మానవతా దృక్పథంతో కూడిన చర్యలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ.. అసలు ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం ఏమిటనేది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ప్రశ్నగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+