బంగ్లాదేశ్ అట్టుడుకుతున్న వేళ.. రంగంలో దిగిన అజిత్ దోవల్
Sheikh Hasina: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా.. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల హిండన్ ఎయిర్‌బేస్‌లో తలదాచుకుంటోన్నారు. ఇది తాత్కాలికమే.
బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అల్లర్లు కొనసాగుతూనే వస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారనేది అక్కడి ప్రజల ఆరోపణ. దీనికితోడు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ.. వంటి ఆమె సారథ్యంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసింది.

సొంతదేశం నుంచి హెలికాప్టర్‌లో పారిపోయిన షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె తొలుత అగర్తల చేరుకున్నారు. అక్కడి నుంచి సీ-30 రకానికి చెందిన భారత ఆర్మీకి చెందిన రవాణా హెలికాప్టర్ హెర్కులెస్‌లో హిండన్ ఎయిర్‌బేస్‌కు వచ్చారు.
రాత్రి అక్కడే బస చేశారు. దీని తరువాత ఆమె లండన్ లేదా బెలారస్ వెళ్తారని తెలుస్తోంది. కాగా- బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ రంగంలో దిగారు. రాత్రి హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారాయన. షేక్ హసీనాతో భేటీ అయ్యారు.
భద్రత వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసిన తరువాత అజిత్ దోవల్ .. హసీనాతో సమావేశం అయ్యారు. వారిద్దరి మధ్య జరిగిన భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు గానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని ఆయన వినిపించారని తెలుస్తోంది.
దీని తరువాత షేక్ హసీనా.. లండన్ లేదా బెలారస్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు ఏ దేశాలు ఆమెకు ఆశ్రయం ఇస్తాయనేది ఇంకా తెలియరాలేదు. ఆమె మేనల్లుడు ప్రస్తుతం బెలారస్‌లో నివస్తోన్నారు. ఆయన వద్దకు వెళ్తారనే ప్రచారం దేశ రాజధానిలో జరుగుతోంది. బెలారస్‌లో అనధికారికంగా కొద్ది రోజుల పాటు తలదాచుకుంటారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications