Nupur Sharma: ఆమె తల నరికితే రూ. 1 కోటి బహుమానం ఇస్తాం, బీమ్ సేన్ చీఫ్ నవాబ్ అరెస్టు, ఫేస్ బుక్!

న్యూఢిల్లీ/గురుగ్రామ్: మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుని బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నూపుర్ శర్మ తల నరికితే రూ. 1 కోటి బహుమానం ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన బీమ్ సేన్ చీఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మతఘర్షణలు జరగడానికి ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, అలాంటి వీడియోలు పోస్టు చేశారని బీమ్ సేన్ చీఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తనకు అనారోగ్యంగా ఉందని, ఆసుపత్రిలో చేర్పించాలని బీమ్ సేన్ చీఫ్ నాటకాలు ఆడారు.

అయితే ఇలాంటి డ్రామాలు ఇంతకు ముందే చాలా చూసిన పోలీసులు మాత్రం బీమ్ సేన్ చీఫ్ కు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు పంపించారు. ఇదే సమయంలో ప్రవక్త గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ కు గురైన నూపుర్ శర్మ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ తల నరికితే కోటి రూపాయలు ఇస్తానని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ప్రజలను రెచ్చగొట్టిన బీమ్ సేన్ చీఫ్ మాత్రం పోలీసులకు చిక్కిపోయి అడ్డంగా బుక్కైపోయాడు.

ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు

ఢిల్లీకి చెందిన నూపుర్ శర్మ కొన్ని రోజుల క్రితం వరకు బీజేపీ నాయకురాలిగా ఆ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనింది. మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో నుపూర్ శర్మ మీద డజన్ల కొద్ది కేసులు నమోదు అయ్యాయి.

ప్రాణహాని ఉందని నూపుర్ శర్మకు పోలీసు భద్రత

ప్రాణహాని ఉందని నూపుర్ శర్మకు పోలీసు భద్రత

ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను చంపేస్తామని ఆమెను దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బెదిరింపులు వచ్చాయి. నూపుర్ శర్మను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదే సమయంలో నూపుర్ శర్మకు ఢిల్లీ పోలీసులు గట్టిబందోబస్తు కల్పించారు. ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించిన తరువాత నూపుర్ శర్మ అనుహ్యంగా ఎవ్వరికి కంటపడకుండా మాయం అయిపోయారు.

నూపుర్ శర్మ తల నరికితే కోటి రూపాయాలు ఇస్తాం

నూపుర్ శర్మ తల నరికితే కోటి రూపాయాలు ఇస్తాం

మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుని బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నూపుర్ శర్మ తల నరికితే రూ. 1 కోటి బహుమానం ఇస్తామని బీమ్ సేన్ చీఫ్ నవాబ్ సత్పల్ తన్వర్ అలియాస్ నవాబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూపుర్ శర్మ అ భూమి మీద లేకుండా చేసిన వాళ్లకు రూ. కోటి ఇస్తానని బీమ్ సేన్ చీఫ్ నవాబ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియాలో రెచ్చగొట్టిన నవాబ్

సోషల్ మీడియాలో రెచ్చగొట్టిన నవాబ్

మతఘర్షణలు జరగడానికి ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, అలాంటి వీడియోలు పోస్టు చేశారని బీమ్ సేన్ చీఫ్ నవాబ్ సత్పాల్ తన్వర్ ను ఢిల్లీ పోలీసులు గురుగ్రామ్ లో తలదాచుకున్న అతన్ని అరెస్టు చేశారు. ఓ వర్గం వాళ్లను టార్గెట్ చేసుకున్న నవాబ్ సోషల్ మీడియాలో నూపుర్ శర్మను చంపేయాలని రెచ్చగొట్టే వీడియోలు పోస్టు చేశారని కేసులు నమోదు అయ్యాయి.

నాటకాలు ఆడిన నవాబ్

నాటకాలు ఆడిన నవాబ్

తనకు అనారోగ్యంగా ఉందని, ఆసుపత్రిలో చేర్పించాలని బీమ్ సేన్ చీఫ్ నవాబ్ సత్పాల్ తన్వర్ నాటకాలు ఆడారు. ఇలాంటి డ్రామాలు ఇంతకు ముందే చాలా చూసిన ఢిల్లీ పోలీసులు మాత్రం బీమ్ సేన్ చీఫ్ నవాబ్ సత్పాల్ తన్వర్ కు ఢిల్లీలోని ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు పంపించారు.

మాయం అయిపోయిన నూపుర్ శర్మ

మాయం అయిపోయిన నూపుర్ శర్మ

నూపుర్ శర్మను హత్య చెయ్యాలని యువతను రెచ్చగొట్టిన నవాబ్ సత్పాల్ తన్వర్ మీద ఇప్పటికే అనేక కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కూడా నవాబ్ మీద కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో ప్రవక్త గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ కు గురైన నూపుర్ శర్మ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది.

అడ్డంగా బుక్కైపోయిన నవాబ్

అడ్డంగా బుక్కైపోయిన నవాబ్

ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నాయకురాలు నూపుర్ శర్మ తల నరికితే కోటి రూపాయలు ఇస్తానని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ప్రజలను రెచ్చగొట్టిన బీమ్ సేన్ చీఫ్ నవాబ్ సత్పాల్ తన్వర్ మాత్రం ఢిల్లీ పోలీసులకు గురుగ్రామ్ లో అడ్డంగా చిక్కిపోయి బుక్కైపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+