ఫైవ్ స్టార్ హోటల్లో నర్సుపై పలుమార్లు గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం రోజే ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఓ నర్సుపై సామూహిక అత్యాచారం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో 27 ఏళ్ల నర్సుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను చూసుకోవడానికి ఈ నర్సును ఏర్పాటు చేశారు.
బాధితురాలికి సహాయకులుగా వచ్ిచన ఇద్దరు వ్యక్తులే నర్సుపై అత్యాచారం చేశారు. సంఘటనతో తీవ్రంగా కలత చెందిన నర్సు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే, నిందితులు మరోసారి నర్సుపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించారు దాంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి తీహార్ పంపించారు.

నిందితులను నీరజ్ (25), రాజన్ (23)గా గుర్తించారు. తాను అత్యాచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, ఉద్యోగం పీకేస్తామని బెదిరించి ఒకరి తర్వాత ఒకరు పలుమార్లు అత్యాచారం చేసినట్లు నర్సు ఫిర్యాదులో చెప్పింది.
ఏం చేయాలో రెండు రోజుల పాటు తనకు పాలుపోలేదని, ఆదివారం రాత్రి కూడా తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో తాను తన భర్తకు విషయం చెప్పానని, దాంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడని బాధితురాలు చెప్పింది.












Click it and Unblock the Notifications