అనూహ్య మలుపు: సీఎంగా పళనిస్వామి, పన్నీరుసెల్వం మద్దతు
అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి పదవి అంశం ట్విస్ట్‌ల మీద ట్విస్టులు కొనసాగుతోంది. తాజాగా, ముఖ్యమంత్రి పదవికి అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఎంపిక చేసిన పళని స్వామికి దక్కనుంది.
చెన్నై: అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి పదవి అంశం ట్విస్ట్‌ల మీద ట్విస్టులు కొనసాగుతోంది. తాజాగా, ముఖ్యమంత్రి పదవికి అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఎంపిక చేసిన పళని స్వామికి దక్కనుంది. అనూహ్యంగా ఆయనకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మద్దతు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పళని స్వామికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ విషయాన్ని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ పన్నీరు సెల్వం మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టలేకపోయరు.

తొలుత అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా శశికళ ఎన్నికయ్యారు. అప్పుడే పన్నీరు రాజీనామా చేశారు. రెండు రోజుల తర్వాత అనూహ్యంగా పన్నీరు.. శశికళపై తిరుగుబావుటా ఎగురవేశారు. అప్పటి నుంచి ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
రెండు రోజుల క్రితం అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడింది. దీంతో పన్నీరుకు చెక్ చెప్పేందుకు శశికళ ముఖ్యమంత్రిగా తెరపైకి పళనిస్వామిని తీసుకు వచ్చారు.
ఇప్పుడు శశికళకు మద్దతు పలుకుతున్న మెజార్టీ ఎమ్మెల్యేలు.. ఆమె సూచించిన పళనిస్వామి వైపు ఉన్నారు. పన్నీరు సెల్వం వైపు ఎమ్మెల్యేలు వస్తున్నారని.. వరుసగా ప్రచారం సాగుతోంది. కానీ పదిమంది ఎమ్మెల్యేలు కూడా ఆయన వైపు లేనట్లుగా కనిపిస్తోంది.
మరోవైపు, ప్రభుత్వాన్ని ఏర్పాుట చేసేందుకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు పళని స్వామికి ఉంది. దీంతో ఆయన ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను చూపించారు. ఈ నేపథ్యంలో పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. పళని స్వామి ముఖ్యమంత్రిగా అయితే పన్నీరు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications