ఓఖీ తుపాను, సముద్రంలో తేలుతున్న జాలర్ల శవాలు, రాజ్ నాథ్ సింగ్, తంబిదురై!
చెన్నై: డిసెంబర్ మొదటి వారంలో తమిళనాడులోని కన్యాకుమారీ జిల్లాలో ఓఖీ తుపాను తాండవానికి సముద్రంలో గల్లంతు అయిన తమిళ జాలర్లలో సుమారు 75 మంది మృతి చెంది ఉంటారని వార్తలు వస్తుండడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సముద్రంలో గల్లంతు అయిన వారి ఆచూకి చెప్పాలని కన్యాకుమారి జిల్లాలో ఆందోళన చేస్తున్నారు.

1, 500 మంది జాలర్లు !
10 రోజుల క్రితం ఓఖీ తుపాను తాకిడికి కన్యాకుమారి జిల్లా అతలాకుతలం అయ్యింది. చేపల వేట కోసం పడవల్లో సముద్రంలోకి వెళ్లిన కన్యాకుమారి జిల్లాకు చెందిన 2 వేల మందికిపైగా జాలర్లు గల్లంతు అయ్యారు. వారిలో సుమారు 1, 500 మంది తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తీరం చేరుకున్నారు.

సముద్రంలో తేలుతున్న శవాలు !
గల్లంతు అయిన జాలర్ల ఆచూకీ తెలుసుకోవడం కోసం 32 మంది జాలర్లు ఐదు పడవల్లో సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో చాలా ఎక్కువ లోతైన ప్రాంతంలో 10 మంది జాలర్ల శవాలు తేలుతున్న విషయం గుర్తించి షాక్ కు గురైనారు. మిగిలిన వారి కోసం నౌకా దళం, సముద్ర తీర గస్తీ సిబ్బంది, సాటి జాలర్లు గాలిస్తున్నారు.

సెల్ ఫోన్లు, ఓటరు ఐడీ కార్డులు !
సముద్రంలో గల్లంతు అయిన జాలర్లకు చెందిన 8 సెల్ ఫోన్లు, రెండు ఓటరు ఐడీ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్న జాలర్లు కన్యాకుమారి జిల్లా అధికారులకు అప్పగించారు. సుమారు 75 మంది జాలర్ల ఆచూకి గల్లంతు కావడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

75 మంది చనిపోయారు, చర్చిల్
సుమారు 75 మంది జాలర్లు శవాలుగా తేలుతున్నారని దక్షిణ ఆసియా జాలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి చర్చిల్ కన్యాకుమారిలో మీడియాకు చెప్పారు. నాలుగు పడవలు సముద్రంలో మునిగిపోయాయని, అందులోని 45 మంది జాలర్లు గల్లంతు అయ్యారని చర్చిల్ విచారం వ్యక్తం చేశారు.

సర్వే, 590 మంది మాయం !
కన్యాకుమారి జిల్లాలోని మత్స్యకారుల గ్రామాల్లో చేపట్టిన సర్వేలో 590 మంది జాలర్లు కనిపించడం లేదని వెలుగు చూసిందని చర్చిల్ చెప్పారు. సముద్రంలో గల్లంతు అయినవారి ఆచూకీ కనిపెట్టాలని డిమాండ్ చేస్తూ వారి కుటుంబ సభ్యులు సముద్ర తీరంలో ధర్నా చేస్తున్నారు.

రాజ్ నాథ్ సింగ్, తంబిదురై !
కన్యాకుమారి జిల్లాను జాతీయ విపత్తు ప్రాంతంగా ప్రకటించాలని అన్నాడీఎంకే పార్టీ ఎంపీ, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు మనవి చేశారు. ఢిల్లీలో హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన తంబిదురై వినతి పత్రం సమర్పించారు.

హాతమీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం !
కేంద్ర పరిశీలకుల బృందాన్ని త్వరలో కన్యాకుమారి జిల్లాకు పంపించి తుఫాను నష్టాలపై అంచనా వేయించి తగిన సహాయం చేస్తామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారని తంబిదురై మీడియాకు చెప్పారు. కన్యాకుమారి జిల్లాలో గల్లంతు అయిన జాలర్ల ఆచూకి చెప్పాలని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. సముద్రంలో గల్లంతు అయిన వారి ఆచూకి కోసం గాలిస్తున్నామని తమిళనాడు మంత్రి జయకుమార్ మీడియాకు చెప్పారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications