లోయలోపడ్డ బస్సు.. 25 మందికి గాయాలు -ఒడిశా, కందమాల్‌ జిల్లాలో ఘటన

వారం రోజుల వ్యవధిలోనే ఒడిశాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈనెల 14న(సోమవారం) కలహండి నుంచి హైదరాబాద్​ వస్తోన్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో 40 మందికిపైగా గాయపడి, అందులో 20 మంది పరిస్థితి విషమంగా మారింది. తాజాగా శుక్రవారం మరో సంఘటనలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు..

ఒడిశాలో మరో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కందమాల్‌ జిల్లాలో ఓ బస్సు లోయలో పడింది. దీంతో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. జిల్లాలోని పుల్‌వాని నుంచి రాజధాని భువనేశ్వర్‌ వెళ్తున్న ప్రైవేటు బస్సు శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలోని గడియపాడఘాట్‌ వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది.

Odisha: Over 25 Injured As Bus Overturns On Ghat Road In Kandhamal

దీంతో బస్సులో ఉన్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Recommended Video

    Manshi Sathpati, A Teacher providing Free education to Tribal Children

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+