దారుణం: కాబోయే భర్త ముందే ఆరుగురు గ్యాంగ్‌రేప్
ఒడిశాలో దారుణం చోటుచేసుకొంది. కాబోయే భర్త ముందే డిగ్రీ విద్యార్థినిపై ఆరుగురు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. భాంజానగర్‌కు చెందిన బాధిత విద్యార్థిని కాబోయే భర్తతో కలిసి గుడికి వెళ్ళి వస్తుండగా
భువనేశ్వర్: ఒడిశాలో మరో దారుణం చోటుచేసుకొంది. గంజాం జిల్లాలో ఓ డిగ్రీ విద్యార్థినిపై ఆరుగురు దుండగులు ఆమెకు కాబోయే భర్తపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొరాపుట్ గ్యాంగ్‌రేప్ ఘటనకు సంబంధించి రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలలు చల్లారకమునుపే అలాంటిదే మరో దారుణం చోటుచేసుకుంది. గంజాం జిల్లాలో ఓ డిగ్రీ విద్యార్థినిని చెరబట్టిన ఆరుగురు దుండగులు ఆమె కాబోయే భర్త ఎదుటే అత్యాచారానికి ఒడిగట్టారు.

భాంజానగర్‌కు చెందిన డిగ్రీ చదువుకుంటున్న యువతి కాబోయే భర్తతో కలిసి సోమవారం మధ్యాహ్నం గంగాపూర్ సమీపంలోని బుధకేందూ థాకూరాణి ఆలయానికి వెళ్లారు. పూజల అనంతరం వారిద్దరూ బైక్‌పై వస్తుండగా రెండు మోటారు సైకిళ్లపై వచ్చిన ఆరుగురు దుండగులు వారిని అడ్డగించారు. యువకుడిని తీవ్రంగా కొట్టి, ఇద్దరి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను లాక్కున్నారు. ఒకరి తర్వాత ఒకరు యువతిపై రేప్‌నకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలను తమ సెల్‌లో చిత్రీకరించారు. అనంతరం వారిద్దరినీ వదలి వెళ్లిపోయారు.
దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ ఆశిష్ సింగ్ వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో ముందు హాజరుపరిచారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఇదిలా ఉండగా, కొరాపుట్‌లో తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. ఈ నెల 10వ తేదీన భద్రతా సిబ్బంది వేషధారణలో ఉన్న నలుగురు దుండగులు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications