కూతురు పెళ్లి ఎఫెక్ట్: సన్నిహిత అధికారి అరెస్ట్, గాలి అరెస్ట్‌కు రంగం సిద్ధం?
కర్నాటక మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గాలికి సన్నిహితుడైన అధికారిని పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కూతురు పెళ్లి కోసం ఆయన రూ.100 కోట్ల పాత నోట్లను తెల్లగా మార్చుకున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
ఓ అధికారి వద్ద పని చేసే డ్రైవర్ రమేష్ గౌడ మృతి నేపథ్యంలో విషయం వెలుగు చూసింది. తాను పని చేసే అధికారి భీమా నాయక్ వద్ద గాలి జనార్ధన్ రూ.100 కోట్ల నల్ల ధనాన్ని వైట్‌గా మార్చుకున్నట్లు రమేష్ సూసైట్ నోట్లో పేర్కొన్నారు. ఇది కలకలం రేపుతోంది.

ఈ నేపథ్యంలో గాలికి సన్నిహితుడైన సదరు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో ప్రత్యేక భూసేకరణ అధికారిగా పని చేస్తున్న భీమా నాయక్ (గాలికి ఇతనే రూ.100 కోట్ల పాత నోట్లను వైట్‌గా మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు), అతడి వ్యక్తిగత డ్రైవర్ మహ్మద్‌లను ఆదివారం గుల్బర్గాలో అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మహత్య చేసుకున్న రమేష్ గౌడ అధికారి భీమా నాయక్ వద్ద డ్రైవర్‌గా పని చేశాడు. రమేష్ గౌడ.. భీమా నాయక్ పేరును సూసైడ్ నోట్లో పేర్కొనడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, మాండ్యలోని ఓ లాడ్జిలో రమేష్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన వంద కోట్ల రూపాయలను 20 శాతం కమిషన్ మీద భీమా నాయక్ వైట్‌గా మార్చారని ఆత్మహత్య నోట్‌లో రమేష్ గౌడ పేర్కొన్నారు.
రూ.18 లక్షలు డబ్బులు తక్కువ రావడంతో గాలి అనుచరుల నుంచి బెదిరింపులు, కమిషన్ విషయం తనకు తెలియడంతో చంపేస్తామని బెదిరించారని ఆతను పేర్కొన్నారు. బీమా నాయక్ అక్రమ సంపాదన, అక్రమాస్తుల వివరాలను రమేష్ తన నోట్లో పేర్కొన్నారు. కాగా, భీమా నాయక్ అరెస్టు నేపథ్యంలో గాలిని కూడా క్యూలో ఉన్నారంటున్నారు.












Click it and Unblock the Notifications