బడికోసం భూమిని దానం చేసిన వృద్దురాలు..
చాలామంది దగ్గర చాలా సంపద పోగై ఉంటుంది. కానీ, వారు ఇతరులకు సహాయం చేసేందుకు ఒకటికి రెండుసార్ల ఆలోచిస్తుంటారు. మరికొందరేమో తమకు ఉన్నదాంట్లోనే ఇతరులకు సహాయం చేయాలని ఆలోచిస్తుంటారు. ఆ కోవకు చెందినవారే ఈ వృద్ధురాలు.. తన దగ్గరున్నరెండెకరాల భూమిని భావితరాల భవిష్యత్తు కోసం ఓ పాఠశాలకు విరాళంగా ఇచ్చింది. ఇప్పుడు అదే పాఠశాలలో ఆమె వంట మనిషిగా చేరింది. ఆమె సేవను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఆ వృద్ధురాలికి ప్రతిష్టాత్మక రాజ్యోత్సవ అవార్డును ప్రకటించింది. రండి ఇంతకీ ఆ వృద్ధురాలు ఎవరో తెలుసుకుందాం.
రాజ్యోత్సవ అవార్డు : కర్ణాటక ప్రభుత్వం ప్రతి ఏడాది కర్ణాటక దినోత్సవం సందర్భంగా రాజ్యోత్సవ అవార్డులను ప్రకటిస్తుంది. ఈసారి కూడా ఆ అవార్డు విజేతలను ప్రకటించింది. ఈ సారి అవార్డు రెండెకరాల భూమిని పాఠశాల కోసం దానం చేసిన వృద్ధురాలికి దక్కింది. ప్రతి ఏటా ఈ అవార్డును నవంబర్ 1వ తేదిన అందజేస్తారు. ఈ సారి కూడా ఆ అవార్డు కొప్పాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు అందుకున్నారు. అందులో మొదటి ఆ స్థానంలో ఆ వృద్ధురాలు ఉన్నారు. ఆమె పేరు హుచ్చమ్మ చౌదరి, ఆమె కొప్పాల నివాసి. రెండోది మోరనాల గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారుడు కేశప్ప, మూడోది సిద్దాపురానికి చెందిన గుండప్ప విభూతి అవార్డుకు ఎంపికయ్యారు.

అదే పాఠశాలలో వంటమనిషిగా : కోప్పల్ తాలుకాకు చెందిన హుచ్చమ్మ అనే వృద్ధురాలు ఈ అవార్డు కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదు. అయినా ప్రభుత్వమే ఆమెను స్వయంగా ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఆమె తన రెండెకరాల భూమిని తన్నూరులోని పాఠశాలకు విరాళంగా ఇచ్చేసింది. ఈ సేవకు గాను ఆమెను అవార్డు వరించింది. అయితే, ఆ వృద్ధురాలు బతుకుదెరువు కోసం అదే పాఠశాలలో వంటమనిషిగా చేరింది. అయితే, ఆ వృధ్ధురాలికి పిల్లలు లేరు. ఆ పాఠశాలలోని పిల్లలను తన పిల్లలుగా చూసుకుంటూ అక్కడే కాలం గడిపేస్తుంది. ఈ అవార్డు గ్రహితకు లక్షరూపాయల నగదు బహుమతితో పాటు, 25 గ్రాముల బంగారాన్ని రాష్ట్రప్రభుత్వం అందిస్తారు.












Click it and Unblock the Notifications